హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచింగ్ కేసులో క్రమంగా పెరుగుతున్నాయి. ముందుగా రెక్కీ నిర్వహిస్తున్న దుండగులు పథకం ప్రకారమే చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని సమయం, సందర్భంగా చూసి మెడలో నుంచి గొలుసు లాక్కుని పారిపోతున్నారు.
తాజాగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఇంటి ఎదుట ముగ్గు వేస్తున్న ఓ మహిళను దొంగ తాగేందుకు నీళ్లు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగా మంకీ క్యాప్ ధరించిన సదరు దొంగ కూడా ఇంట్లోకి వెళ్లి అంజలి అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు.ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.