అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే కేసీఆర్ రావాలని కోరిన నేపథ్యంలోనే… ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. ఇక రేపటి నుంచి రెగ్యూలర్ గా అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్సు ఉంది.

ఇక అటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లాగా ఉందని చురకలు అంటించారు. గత 15 నెలల అట్టర్‌ప్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామన్నారు కేటీఆర్. రేవంత్ చేతకానితనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే. 20 శాతం కమీషన్ తప్ప.. విజన్ లేని ప్రభుత్వం ఇది. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్.