ఇంద్ర భవనాన్ని తలపించే ఇంటిని సమంతకు బహుమతిగా ఇచ్చిన చైతూ..!!

-

సమంత – నాగచైతన్య .. వీరిద్దరి మధ్య బాండింగ్ గురించి గతంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో నాగచైతన్య పై సమంత ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడు ఫైర్ అవుదామా? అని చూస్తూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య పై తనకున్న కోపాన్ని వ్యక్తపరిచింది. ఇక మాజీ భర్త అని పిలవమని , అంతేకాదు చైతూ ని తనను ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలు లేకుండా చూసుకోవాలని ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ, చైతూ ని మానసికంగా ఇబ్బంది పెట్టింది . దీనితో ఆగ్రహించిన చైతన్య అభిమానులు కూడా సమంతాపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా నాగచైతన్య వ్యక్తిత్వానికి నిదర్శనం సమంతా కి బహుమతిగా ఇచ్చిన ఆ అందమైన ఇంద్ర భవనం అని చెప్పవచ్చు.. అసలు విషయం ఏమిటంటే నాగచైతన్య సమంతను ప్రేమిస్తున్న సమయంలో ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ తన కుటుంబ సభ్యుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లను చూసి ఆశ్చర్యపోయాడట.

ఇక తనకు కూడా ఒకటి కావాలని అడిగితే మురళీమోహన్ నిరాకరించాడట. కానీ ఈ విషయం నాగార్జునకు చెప్పగా నాగార్జున నేరుగా వచ్చి అడిగేసరికి మురళీమోహన్ కాదనలేక నాగచైతన్య కోసం ఆ అందమైన ఇంటిని ఇచ్చేసారట.

ఇక వివాహమనంతరం నాగచైతన్య – సమంత నాలుగు సంవత్సరాల పాటు అదే ఇంటిలో తమ జీవితాన్ని గడిపారని.. ఇక నాగచైతన్య – సమంతకు గొడవలు మొదలైనప్పటి నుంచి నాగచైతన్య ఆ ఇంటిని సమంతకే ఇచ్చేసినట్లు మురళీమోహన్ వెల్లడించారు.

ఇక ఆ ఇంటిని తీసుకోవడానికి సమంత ముందు ఒప్పుకోకపోయినా ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న అదే ఇంటిలో సమంత ఉంటున్నట్లు సమాచారం.ఇకపోతే ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న అద్భుతమైన ఆ ఇంటిని సమంతకు బహుమతిగా ఇచ్చిన చైతూ ని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు ఆమెపై తన ప్రేమను ఇంతలా ఎక్స్ప్రెస్ చేయాలా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక చైతూ బహుమతిగా ఇచ్చిన ఆ ఇంట్లో ప్రతిదీ కూడా హైటెక్నాలజీతో.. ప్రకృతి వాతావరణంతో చాలా అందంగా ఆ ఇంటిని తీర్చిదిద్దారు. ఇక ఆ ఇంటి లోపల ఉన్న ఇంటీరియర్ డిజైనింగ్ విషయానికి వస్తే చూసిన వారంతా నోరెళ్ళబెట్టాల్సిందే..

ఇక ముఖ్యంగా వారి బెడ్ రూమ్, కిచెను, డైనింగ్ హాలు, యోగా సెంటర్, గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్, టీవీ హాల్ ఇలా ప్రతిదీ కూడా చాలా ముందు జాగ్రత్తతో నిర్మించినట్లు తెలుస్తోంది . ఇక ఈ ప్రదేశాలలో సమంత గడిపిన సన్నివేశాలు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా తాజాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version