బాలీవుడ్ స్టార్ హీరో‌పై పోలీస్ కేసు..ఎందుకంటే?

-

బాలీవుడ్ స్టార్ హీరో..ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్..ఇటీవల నగ్న ఫొటోషూట్ తో సందడి చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ జరుగుతోంది. రణ్ వీర్ ఇలా చేయడాన్ని నెటిజన్లు, పలువురు తప్పుబడుతున్నారు. కాగా, సినీ ప్రముఖులు మాత్రం కొందరు సపోర్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రణ్ వీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కంప్లయింట్ వచ్చింది. రణ్ వీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమకు దరఖాస్తు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈస్ట్ ముంబై సబర్బ్ లోని ఎన్జీవో ఆఫీస్ బేరర్ చెంబూర్ పీఎస్ లో కంప్లయింట్ చేశారని పేర్కొన్నారు.

తన నగ్న ఫొటోషూట్ తో రణ్ వీర్ సింగ్ ..మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారి నిరాడంబరతను దెబ్బతీశాడని పేర్కొన్నారు. రణ్ వీర్ పై ఐటీ యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కంప్లయింట్ లో తెలిపారు.

ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. రణ్ వీర్ కంటే ముందర…టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ పిక్చర్ పోస్టర్ లో నగ్నంగా కనిపించారు. రణ్ వీర్ తో పాటు పలువురు హీరోలు కూడా నగ్న ఫొటో షూట్స్ చేశారు. ఈ పోలీస్ కేసు విషయమై రణ్ వీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version