దేశవ్యాప్తంగా మూడు గంటల పాటు రహదారుల దిగ్బంధం చేయడానికి “సంయుక్త కిసాన్ మోర్చా” పిలుపునిచ్చింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను రైతు సంఘాలు దిగ్బంధనం చేయనున్నాయి. అయితే రైతుల ట్రాక్టర్ ల ర్యాలీ సంధర్భంగా గత నెల26 న దేశారాజధానిలో హింస చెలరేగిన నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దుల నుంచి రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఇక మరో కనీస మద్ధతు ధర పై పార్లమెంట్ లో నేడు కేంద్రం ప్రకటన చేసే అవకాశం అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రైతుల “చక్కా జామ్” నేపధ్యంలో నిన్న ప్రధానితో కీలక కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ఢిల్లీ పోలీసు కమిషనర్, ఇంటలిజెన్స్ ఛీఫ్ తో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా పార్లమెంట్ లో మోడీ నేతృత్వంలో అత్యంత ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇక ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు అంటూ కీలక మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి.