టెస్ట్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఆయన స్టార్క్ వేసిన తొలి ఓవర్ లో 16 రన్స్ బాదారు. అందులో 4 ఫోర్లు బాదడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ పేరిట ఉండేది. సెహ్వాగ్ (13), రోహిత్ శర్మ (13) పరుగులు చేయగా.. ఇవాళ జైస్వాల్ 16 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
ఇవాళ మంచి జోరు మీద కనిపించిన జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఐదో టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 141/6 స్కోరు చేసిది. జడేజా (8), సుందర్ (06) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, కోహ్లీ 06, నితీష్ 04 పరుగులు చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బొలాండ్ 4 వికెట్లతో రాణించారు.