ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజవర్గం పరిధిలో గల చాక్వాడి నాలా మరోసారి కుంగింది. గతంలో ఇదే ప్రాంతంలో నాలా కుంగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు ఇంకా పూర్తి కాకముందే మరోసారి నాలా కుంగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హడలెత్తిపోతున్నారు.
తాజాగా గోషామహల్లో చాక్వాడి నాలా మీదుగా వెళ్తున్న క్రషర్ లారీ నాలా కుంగడంతో ఒక్కసారిగా అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపెడ్డాడు. చాక్వాడి ప్రాంతంలో వరసగా నాలాలు కుంగుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో సామాన్య ప్రజలు, స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలా పనులను త్వరగా పునరుద్ధరించాలని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు.