కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్ : రేవంత్ రెడ్డి

-

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రీన్ బిజినెస్ సెంటర్ లో రేవంత్ రెడ్డి మొక్క నాటారు. 
స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధి గురించి సీఐఐ ప్రతినిధులతో చర్చించారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములు అవుతామని సీఐఐ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు.   తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ సిటీనీ ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతుందని తెలిపారు. కాలుష్య నివారణకు 3,200 వేల ఈవీ బస్సులు తెచ్చామని.. ఈవీ వాహనాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేసన్ పన్నులను మినహాయించామన్నారు.  ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలాల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version