కమలాపూర్ అంటే ఒకప్పుడు అది ఎమ్మెల్యే నియోజకవర్గం. అక్కడ రెండు సార్లు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ అది రద్దయి హుజూరాబాద్‌లో కలిసింది. అప్పటి నుంచి ఈటల కూడా హుజూరాబాద్ నుంచే పోటీ చేస్తూ గెలుస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో రాజకీయాల్లో కమలాపూర్‌ది ప్రత్యేక స్థానం.
ఈ మండలమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి మండలంలో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని రంగంలోకి దింపింది. ధర్మారెడ్డికి ఈ నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉంది. ఆయన నియోజకవర్గం కూడా దీనికి ఆనుకునే ఉంటుంది.
దీంతో ఎప్పటి నుంచో కమలాపూర్ నేతలతో ధర్మారెడ్డికి మంచి సన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన కమలాపూర్ టీఆర్ ఎస్ నేతలతో వరుసగా మీటింగులు పెడుతూ వారిని పార్టీ వెంట నడిచేలా చేస్తున్నారు. తన సామాజిక వర్గం అండతో ఈ మండలంలో మిగతా నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. ఇది ఈటలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరి ధర్మారెడ్డికి ఈటల ఏ స్థాయిలో కౌంటర్ ఇస్తారో చూడాలి.