డైట్ సప్లిమెంట్స్: ఒరిజినల్, డూప్లికేట్ సప్లిమెంట్ల మధ్య తేడాలు తెలుసుకోండి..

-

డైట్ విషయంలో సప్లిమెంట్ల వాడకం బాగా పెరిగింది. ఇంతకుముందు ఇప్పుడు శరీరాకృతిపై శ్రద్ధ బాగా పెరిగింది. ఆరోగ్యం మీద ఆలోచన పెరగడంతో సప్లిమెంట్ల వాడకం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ సప్లిమెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒరిజినల్ మాదిరిగానే రంగూ, రూపం అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ అవి డూప్లికేట్ సప్లిమెంట్లు. ఒరిజినల్ అనుకుని వాటిని తీసుకోవడం మొదలు పెడితే శరీరానికి నష్టం కలుగుతుంది. అందుకే ఒరిజినల్, డూప్లికేట్ల మధ్య తేడాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తేడాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

బార్ కోడ్

ప్రస్తుతం ప్రతీ స్మార్ట్ ఫోన్ కి బార్ కోడ్ స్కాన్ చేసే యాప్స్ ఉంటున్నాయి. సప్లిమెంట్లు కొనుక్కున్నాక దాని బార్ కోడ్ స్కాన్ చేయండి. దానివల్ల డైరెక్టుగా దాని సైటు తెరుచుకుని ఆ సప్లిమెంట్ దేనికి సంబంధించినది, దేనితో తయారైనది సహా అన్ని వివరాలు ఉంటాయి. అలా ఓపెన్ కాలేదంటే అది సరైనది కాదని అర్థం చేసుకోండి.

ప్యాకేజీ

సప్లిమెంట్ల ప్యాకేజీలను జాగ్రత్తగా గమనించండి. దానిపైన పేరు, కంపెనీ తదితర వివరాల స్పెల్లింగుల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? లేదా అక్షరాల రాత అదోలా ఉందా మొదలైన విషయాలు చూసుకోవాలి. మీకేమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయండి.

FSSAI అనుమతి

భారతీయ ఆహార ప్రమాణాల, సురక్షణ సంస్థ అనుమతి ఆ సప్లిమెంట్ కలిగి ఉందా లేదా అన్నదు చూసుకోవాలి. ఈ సంస్థ అనుమతి లేదంటే అది సరైనది కాదని గుర్తుంచుకోండి. వెంటనే వాటిని పక్కన పెట్టేయండి.

హోలోగ్రామ్

డూప్లికేట్ కంపెనీలకి హోలోగ్రామ్ ఉండకపోవచ్చు. అందువల్ల మీరు కొనే సప్లిమెంట్ల ప్యాకేజీపైన హోలోగ్రామ్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఎమ్ ఆర్ పీ

డూప్లికేట్ కంపెనీ వస్తువుల మీద ఎమ్ ఆర్ పీ స్టిక్కర్ అతికించబడి ఉంటుంది. అదే ఒరిజినల్ అయితే దానికే ప్రింట్ చేయబడి ఉంటుంది. ఈ విషయం ఒక్కసారి చెక్ చేసుకోండి

సరైన చోటు

ఎక్కడ పడితే అక్కడ డైట్ సప్లిమెంట్స్ కొనకండి. కొద్దిగా గుర్తింపు ఉన్న వాటిల్లోనే కొంటే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version