కొడుకు అంటే ఇలానే ఉండాలి.. చాణక్య చెప్పిన విషయాలను తప్పక తెలుసుకోవాలి..!

-

చాణక్య చాలా విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. చాణక్య కొడుకుల గురించి కూడా ఎన్నో విషయాలని చెప్పారు. సాధారణంగా కొంత మంది తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటూ ఉంటారు. బాధ్యతగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోరు. అయితే చాణక్య ప్రకారం అసలు కొడుకు ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్లలు పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతారు. కానీ మగ పిల్లవాడు అమ్మానాన్నలతో ఉండి బాధ్యతగా వ్యవహరించి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కొడుకు ఉండడం కాదు జ్ఞాన సంపన్నుడైన కొడుకు ఉంటే మంచిదని.. అది ప్రధానమని నీతి శాస్త్రంలో చాణక్య చెప్పారు.

కేవలం ఉత్తమ కొడుక్కి ఉండాల్సిన లక్షణాలు గురించి ఆయన నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. మంచి సువాసన ఉండే చెట్టు ఎలా అయితే సువాసనని వెదజల్లుతుందో అలాగే జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి వలన మంచి జరుగుతుందని చెప్పారు. ఎండిపోయిన వృక్షం అడవిని ఎలా అయితే మండిస్తుందో అనర్హుడైన కొడుకు వలన అంత నష్టం ఉంటుందని అన్నారు. చందమామ ఎలా అయితే వెలుగును పంచుతుందో ఉత్తముడైన కొడుకు, విద్యావంతుడైన కొడుకు, నీతివంతుడైన కొడుకు వంశానికి అలాంటి వాడు అని చాణక్య నీటి శాస్త్రంలో చెప్పాడు.

తమపై ఆధారపడిన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటే సమర్థవంతుడైన కొడుకు అనిపించుకుంటాడని చాణక్య చెప్పారు. అలాగే చాణక్య దృష్టిలో సంతానం అంటే కేవలం మగ పిల్లలు మాత్రమే. అయితే ఈ రోజుల్లో కొడుకులాగే కూతుర్లు కూడా ఉద్యోగాలు చేయడం తల్లిదండ్రులను చూసుకోవడం వంటివి చేస్తున్నారు. ఆడైనా మగ అయినా సరే తల్లిదండ్రులని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటేనే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news