మెగాస్టార్ సినిమాలు వాయిదా పడే ఛాన్స్.. కారణం అదేనా?

-

మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే. ఆ మాస్ క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త రికార్డుల గురించి సినీ వర్గం చర్చించుకుంటుంది. అలాంటిది చిరు రాజకీయాల తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వేగంగా సినిమాలు వస్తాయని అభిమానులు ఆశపడ్డారు. చిరు కూడా చాలా సందర్భాల్లో తాను వేగంగా సినిమాలు పూర్తి చేసి అభిమానులను ఖుషీ చేస్తానని చెప్పారు. చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు ఎంత పెద్ద హిట్ సాధించాయో మనందరికీ తెలుసు. తనలోని వాడీ, వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్.

ఇక సైరా తర్వాత ఏకంగా నాలుగు సినిమాలు ఓకే చేశాడు మెగాస్టార్. వాటికి డైరక్టర్లు, కథలు, నిర్మాతలు సిద్ధమైపోయారు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా అందుకు అడ్డుపడుతోంది. 2020లో కొవిడ్ కారణంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని చిరు.. కరోనా తీవ్రత తగ్గాక సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో మళ్లీ ఇబ్బందులు తప్పట్లేదు. సెట్స్‌పై ఉన్న సినిమాలు పూర్తికాకపోవడం ఒక ఇబ్బంది అయితే, లైన్లో ఉన్నవి మొదలుకాకపోవడం మరో సమస్యగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ దానికి కరోనా అడ్డుపడి ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక మోహన్‌ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ షూటింగ్‌ మొదలుపెడతామని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో మళ్లీ కరోనా తిరగబెట్టడంతో సినిమా వాయిదా వేస్తున్నారట. ఈ విషయంపై మూవీ టీం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version