ఛీఫ్ మినిస్టర్ కోయి బీ హో.. హమారే సామ్‌నే ఝుక్‌తాహై యా నహీ.. బాబూ సే లేకే రాజశేఖర్ రెడ్డిసే లేకే రోషయ్యా, కిరణ్ కుమార్ యా కేసీఆర్.. సాబ్.. సున్తే హైనా,,? ఝుక్తే హైనా అంటూ అక్బరుద్దీన్ మాటల గురించి చర్చించే సమయం వచ్చేసింది. నిజమే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎంఐఎం పార్టీపై ఆధారపడేలా చేశాయి.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. దానికి ఏ పార్టీ అతీతం కాదు.. అందునా టీఆర్ెస్, ఎంఐఎం లా దోస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఈసారి జరిగిన గ్రేటర్ ఎలక్షన్స్‌లో మాత్రం తమకు ఎవరితో దోస్తాన్ లేదంటూ చెప్పకొచ్చాయి రెండు పార్టీలు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ రామ చిలుక అంటే, నీతో ఖటీప్ అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. కానీ అవి అన్నీ కేవలం ఎన్నికల ప్రచారం కోసమన్నది ఓపెన్ సీక్రెట్.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఝుక్ తా హైనా అంటూ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చలోకి వచ్చింది.. వస్తుంది కూడా.. ఎందుకంటే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయి?? గతంలో గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం ఎక్కాలంటే ఎంఐఎంతో దోస్తాన్ ఉండాల్సిన పరిస్థితి. కానీ 2016 ఎన్నికల్లో టీఆర్ెస్ 99 సీట్లలో గెలిచి ఒంటరిగానే గ్రేటర్ పీఠాన్ని ఎక్కింది. అయినా కూడా కేసీఆర్ ఎంఐఎంను మిత్రపక్షం లానే ట్రీట్ చేసేవారు.
కానీ ఉన్నట్టుండి 2020 ఎన్నికల ముందు అసదుద్దీన్‌తో భేటీ అయిన తరువాత టీఆర్ెస్, ఎంఐఎం పార్టీలు ఫ్రెండ్‌షిప్ లేదు ఎం లేదంటూ ప్రకటిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముగిసాయి.. ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. ట్రెండ్ చూస్తుంటే ఈ రెండు పార్టీలు ఊహించినన్ని సీట్లు రాబట్టే పరిస్థితి కనిపించట్లేదు.. అందుకే దోస్ మేరా దోస్త్ అంటూ పలకరింపులు మొదలయ్యాయని తెలుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 56 స్థానాల్లో గెలవగా,. బీజేపీ 49 స్థానాల్లో పాగా వేసింది. ఇక ఎంఐఎం పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 56 సీట్లకు తనకు ఉన్న 28 ఎక్స్ అఫియో ఓట్లు కలిపినా మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేదు.
ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకొంటే టీఆర్ఎస్ బలం 84గా ఉండగా, ఎంఐఎం బలం 53 ఉంది, బీజేపీ బలం కూడా 52 అవుతుంది. టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని ఎక్కాలంటే 15 సీట్లు అవసరం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థులను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నా కుదరని పరిస్థితి. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా మేయర్ ఎవరంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకపోయినా.. అవసరమున్నన్ని సీట్లు రాలేదంటూ ముక్తాయించారు.
ఎట్టిపరిస్థితుల్లో ఒంటరిగా ఏ పార్టీ కూడా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోలేదు. టీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు పొడిచేలా కనిపిస్తుంది. బిజేపీ, ఎంఐఎంల కాంబినేషన్ నో ఛాన్స్ .. ఒకవేళ ఇదే గనక జరిగితే ప్రపంచ వింతే.. మరి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో కలిసి నడుస్తుందా..? అసదుద్దీన్ బాషలో అయితే ఝుక్ తాహై?? నా..?