వైసీపీది ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేయ‌డ‌మే ప‌ని : చంద్ర‌బాబు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీ ప‌ని ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేయ‌డ‌మే అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో క‌రోనా వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. క‌రోనా కేసులు ఎక్కువ వ‌స్తున్నా.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల జీతాల‌లో కోత విధించ‌లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. కాగ ఈ రోజు రాష్ట్ర టీడీపీ నాయ‌కులతో ప్ర‌భుత్వంతో వ్య‌వ‌హ‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించారు.

chandrababu

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు జ‌గ‌న్ పై, వైసీపీ పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల‌కు టీడీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన రాయితీలను ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ కోత విధించింద‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి క‌న్నా.. త‌మ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్ధిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అన్నారు. అయినా.. త‌మ ప్ర‌భుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ను ప్ర‌క‌టించామ‌ని గుర్తు చేశారు. కానీ నేడు ఉద్యోగులు ఫిట్ మెంట్ ఉద్య‌మం చేస్తే.. ప్ర‌భుత్వ స‌ల‌హా దారుగా ఉన్నా.. స‌జ్జ‌ల రామ కృష్ణ రెడ్డి ఉద్యోగుల‌ను బెదిరించార‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version