మ‌త సామ‌ర‌స్యం గాడ్సే ఆరాధ‌కుల‌కు అర్థం కాదు : కేటీఆర్ కౌంట‌ర్

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే ఉంది. ఈ రోజు బీజేపీ నేత రామ చంద్ర రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో వార్ న‌డుస్తుంది. రామ చంద్ర రావు, కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు కౌంట‌ర్ ఇస్తు.. ట్వీట్ చేశాడు. ముందుగా రామ చంద్ర రావు ట్వీట్ కు కౌంట‌ర్ ఇస్తు.. మ‌త సామ‌ర‌స్యం, బ‌హుళ‌త్వం వంటి ప‌దాలు గాడ్సే ను పూజించే వాళ్లకు అర్థం కావ‌ని అంటూ ట్వీట్ చేశారు. 8 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన బీజేపీ.. దేశానికి 80 సంవ‌త్స‌రాల వెనక్కి తీసుకెళ్లింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ కు రీప్లే ఇస్తూ.. తాము రాష్ట్రానికి అండ‌గా ఉన్నామ‌ని.. బీజేపీ దేశానికి దండ‌గా ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ తెలంగాణ‌కు ఐటీఐఆర్ ఇవ్వ‌కున్నా.. దిగ్గ‌జ ఐటీ కంపెనీల‌ను తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. అలాగే జాతీయ హోదా ఇవ్వ‌కున్నా.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టుకున్నామ‌ని అన్నారు. అలాగే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టిరీ ఇవ్వ‌కున్నా.. ప్రైవేట్ కోచ్ ఫ్యాక్ట‌రీ పెట్టుకున్నామ‌ని అన్నారు. ఇక బీజేపీ రాష్ట్రం కోసం ఏం చేసిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version