రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఒక రిటైర్డ్ జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని.. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితిలు వీళ్లకు పట్టవా!? అని ఫైర్ అయ్యారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొందరు పేటీఎం బ్యాచులు తయారయ్యారని…రాష్ట్రంలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ రిటైర్డ్ జడ్జిలకు కనపడదా! అని నిలదీశారు. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయ వచ్చా..? అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రిటైరైన తరువాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఈ వ్యాఖ్యలు అని మండిపడ్డారు.
సీపీఎస్ రద్దు పై జగన్ హామీ ఏ మయ్యింది..? హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి అన్నారు.. ఇప్పుడేం చెపుతారు..? అని ఫైర్ అయ్యారు. ఓ దొంగ పిల్లి.. కళ్ళు మూసుకుని పాలు తాగు తూ ఎవరూ చూడడం లేదు అనుకుంటుంది.. అలా ఉంది జగన్ తీరని…ఒక్కసారి అని ఓటేసిన ప్రజలు.. ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారని పేర్కోన్నారు చంద్రబాబు.