తలపట్టుకుంటున్న చంద్రబాబు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బిజెపి, వైసీపీ స్నేహం అనేది వైసీపీకి మాత్రమే లాభించే అంశం. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో రహస్యంగా అయినా సరే జగన్ కు స్నేహం అవసరం. జగన్ ఇప్పుడు బలమైన నేత… ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయాలు కూడా అదే విధంగా తీసుకుంటున్నారు. రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి.

జగన్ మీద రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఎన్నో ఆశలు ఉన్నాయి. అవి నేరవేర్చినా నేరవేర్చకపోయినా సరే వైసీపీ ని ముందుకు నడిపించాలి అంటే… జగన్ కాస్త దూకుడు తగ్గించాలి అనే అభిప్రాయం వినపడుతుంది. బిజెపి నేతలు పదే పదే చెప్పినట్టు వాళ్ళ సహకారంతోనే జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు అనేది మెజారిటి వైసీపీ నేతల, కార్యకర్తల, ప్రజల అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. చంద్రబాబు అవినీతిని ఆయన టార్గెట్ చేసారు.

ఆ అవినీతి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళారు. జన్మభూమి కమిటీల నుంచి ప్రతీ ఒక్కటి టీడీపీ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు ఆ నిర్ణయాల మీద సిట్ వేసారు. అవినీతి ఆరోపణలను రుజువు చేయడానికి మంత్రి వర్గ ఉపసంఘాలు కూడా వేసారు జగన్. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయం బిజెపిని వైసీపీ ని దూరం చేసుకునే విధంగా ఉంది అంటున్నారు.

జగన్ అవినీతి విషయంలో వేసిన సిట్ టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే టీడీపీ నేతలు కొందరు పైకి కనపడని అవినీతి చేసారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నేతలు ఈ అవినీతిలో కూరుకుపోయారు. అందులో చంద్రబాబుకి ఆర్ధికంగా అండగా నిలిచిన నేతలు కూడా ఉన్నారు. వారిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబు ముందు ఉంది.

ఆ అవసరంతోనే ఆయన బిజెపి తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. ఎంత కాదన్నా టీడీపీ అనేది క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న పార్టీ కాబట్టి చంద్రబాబు అవసరం బిజెపికి ఉండవచ్చు. అలాగే జాతీయ స్థాయి నేత కాబట్టి జమిలీ ఎన్నికలు సహా కొన్ని అవసరాలు చంద్రబాబుతో ఉండవచ్చు. కాబట్టి జగన్ చంద్రబాబుని గట్టిగా నొక్కితే, విడిపించుకోవడానికి చంద్రబాబు బిజెపి తలుపు తట్టే అవకాశం ఉంది. కాబట్టి జగన్ కాస్త దూకుడు తగ్గి సామరస్యంగా ముందుకి వెళ్ళాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version