మెగాస్టార్చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా శరవేగంగా షూటింగ్‌జరుపుకుంటోంది. త్రిష నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో శక్తివంతమైన పాత్ర ఉంది. దాన్ని ఎవరు పోషిస్తారనే దానిపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
కొంతకాలంగా రామ్ చరణ్ పేరు ప్రముఖంగానే వినబడుతోంది. ఈమధ్య అల్లు అర్జున్ పేరు కూడా పైకొచ్చింది. కానీ ఇవేవీ కాకుండా సడెన్గా ఇంకో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే.. ఆ ‘అతిథి’ పాత్ర పోషించబోతున్నది మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. దద్దరిల్లిపోయే ఈ కలయిక పరిశ్రమనే కాదు, యావత్ ప్రేక్షక కలోకాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తబోతోంది.
దర్శకుడు కొరటాల శివ మహేశ్ బాబు రెండు సినిమాలు, ‘శ్రీమంతుడు’, ‘భరత్అనే నేను’ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. అలాగే మెగాస్టార్చిరంజీవి అంటే మహేశ్బాబుకు ఎంత గౌరవముందో అయనే స్వయంగా ప్రకటించాడు. దాంతో చిరంజీవి సినిమాలో ఉన్న పవర్ఫుల్పాత్రను మహేశ్చేస్తే చాలా బాగుంటుందని అనుకున్న శివ, మహేశ్ బాబు అడగడంతో ఆయన సంతోషంగా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇది అతిథి పాత్రే అయినప్పటికీ దాదాపు 20 నిమిషాలపాటు మహేశ్తెర మీద కనిపిస్తాడని టాక్. ఇదివరకు కొన్ని సినిమాలకు మహేశ్వాయస్ఓవర్ఇచ్చాడు కానీ, ఎక్కడా కనబడలేదు. వాటిల్లో పవన్కళ్యాణ్సూపర్హిట్‘జల్సా’ కూడా ఉంది.
రామ్‌చరణ్, మహేశ్‌బాబుల ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఉంది. రామ్‌చరణ్‌భార్య ఉపాసన, మహేశ్‌సతీమణి నమ్రత ఎంతో క్లోజ్‌ఫ్రెండ్స్. అలాగే రామ్‌చరణ్‌మహేశ్‌లు కూడా తరచూ మంచి స్నేహితులు. వీరి రెండు కుటుంబాలు తరచూ ఇద్దరి ఇళ్లల్లోనూ కలుసుకుని అనందంగా సమయం గడుపుతుంటారు. ఉపాసనకు మహేశ్‌కూతురు సితార అంటే ఎంతో ఇష్టం. సితారను తీసుకుని తన ఇంటికి కూడా వెళ్లిపోతుందట ఉపాసన. ఈ సాన్నిహిత్యం కూడా ఈ అదిరిపోయే కాంబినేషన్‌కు ఉపయోగపడిందని సమాచారం. అన్నట్లు రామ్‌చరణ్‌కూడా ఈ సినిమాకు ఒక నిర్మాత.
అయితే, మెగాస్టార్‌సూపర్‌స్టార్‌కాంబినేషన్లో సీన్లుంటాయా, లేదా అనేది తెలియాల్సివుంది. అలాగే మెగాస్టార్‌యుక్తవయస్సు పాత్రను రామ్‌చరణ్‌పోషిస్తాడనే టాక్‌చాలాకాలం నుండి నడుస్తోంది. మరి ఈ రెండు పాత్రలు వేరువేరా, ఒకటేనా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.
కానీ, ఇలాంటి అరుదైన కలయికలో ఒక చిత్రం రావడం ఎంతో సంతోషించాల్సిన విషయం. తెలుగు పరిశ్రమ ఆలోచనావిధానం మారుతోందనడానికి ఇది కూడా ఒక మంచి ఉదాహరణ.