ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు : చంద్రబాబు

-

మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే రోజులు పోయాయని, అందుకు కంచర్ల శ్రీకాంత్ గెలుపే నిదర్శనమన్నారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. జీసస్ మహా త్యాగానికి గుర్తు.. గుడ్ ఫ్రైడే అని, త్యాగం, ప్రేమ అందరికి పంచాలనేది జీసస్ ఆశయమన్నారు. అంతేకాకుండా.. ‘అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాను.. ఎక్కువకాలం సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా పని చేసాను..జగనే మా భవిష్యత్ కాదు.. జగనే రాష్ట్రానికి దరిద్రం.. జగనే మా నమ్మకం.. మా భవిష్యత్ మాటలు కాదు.. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి.. అసంపూర్తి పనులు…టి.డి.పి.హయాంలో అభివృద్ధి పనుల పై సెల్ఫీ ఛాలెంజ్ చేయాలి.

దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలి. గంజాయి.., గన్ కల్చర్.. మద్యానికి బానిసలైపోకుండా ప్రజలను కాపాడాలి.. జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి అయితే ఎందుకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదో చెప్పాలి.. ఇప్పుడు టిడ్కో ఇళ్లు, బూత్ బాంగ్లాలుగా మారిపోయాయి. రాష్ట్రంలో అప్పులు పెరిగాయి. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. తిరుమలలో గంజాయి..పులివెందులలో గన్ క్షల్చర్…నాసిరకం మద్యం..ఇలా ఉంది పరిస్థితి. సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు…విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలోం వున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు కు పంపుతున్నారు. టీడీపీ హయాంలో నీటిపారుదల అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version