పోలవరం రాష్ట్రానికి ఓ వరం.. పోలవరానికి జగనే శని : చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం తరతరాల ఆకాంక్ష.. పోలవరం రాష్ట్రానికి ఓ వరమని, పోలవరానికి జగనే శని ఆయన అన్నారు. అహకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని, శవిపోతేనే పోలవరం కల సాకారం కాదన్నారు. పోలవరం పూర్తైతే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చని, లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చని, పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని, పోలవరం ఏపీకి జీవనాడని, పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో రూ. 4114 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ. 1890 కోట్లే ఖర్చు చేశారని, పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు చంద్రబాబు.

అంతేకాకుండా.. ‘పరిహరం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారు. ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగనుదే. సుమారు 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారు. కాంట్రాక్టరును మార్చొద్దని పీపీఏ చెప్పినా జగన్ వినలేదు. పీపీఏ స్పష్టంగా చెప్పినా మూర్ఖుడు కాంట్రాక్టరును మార్చారు. నాటి వైఎస్ ప్రభుత్వం పోలవరానికి వేసిన చిక్కుముళ్లను విడదీసి పోలవరం నిర్మాణం చేపట్టాం. పోలవరం నిమిత్తం టీడీపీ హయాంలో 11537 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ కేవలం రూ. 4611 కోట్లతో సరిపెట్టారు. టీడీపీ హయాంలో 45.72 మీటర్ల ఎత్తున పోలవరం నిర్మించాలనుకుంటే.. జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతున్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version