బాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదా!?

-

సుమారు రెండునెలలకు పైగా సుధీర్ఘ విశ్రాంతి తర్వాత ఏపీకి బయలుదేరి క్షేమంగా అమరావతికి చేరుకున్నారు చంద్రబాబు! ఈ ప్రయాణం మొత్తం లాక్ డౌన్ రూల్స్ ను పూర్తిగా తుంగలోకి తొక్కుతూ “చెప్పేటందుకే నీతులు ఉన్నాయి” అని నిరూపిస్తూ సాగింది! ఇంతకాలం ఆన్ లైన్ లో “లాక్ డౌన్ నిబంధనలు” గురించి ప్రసంగాలు చేసిన బాబు… తాను మాత్రం ఆ రూల్స్ ని పట్టించుకోకుండా నడుచుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా బాబు ఆరోగ్యంపై కొందరు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు! ఇంతకూ వారి ఆవేదన ఎందుకు.. ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

తాను విశాఖ వెళ్లి వస్తానని.. అనుమతి ఇవ్వాలని ముందుగా కేంద్రానికి రిక్వస్ట్ పెట్టుకుని అభాసుపాలయిన చంద్రబాబు.. అనంతరం తొలుత విశాఖ పర్యటనకు, అక్కడ నుంచి అమరావతికి రావడానికి అనుమతి కోరుతూ ఏపీ డీజీపీకి రిక్వస్ట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై ఏపీ డీజీపీ, బాబుకు ప్రత్యుత్తరమిస్తూ… కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల ప్రకారం.. 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులు ఇంటికే పరిమితం కావాలని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చిన వారు కరోనా పరీక్షలో నెగెటివ్‌ గా తేలినా కూడా హోం క్వారంటైన్‌ లోనే ఉండాలని.. రాత్రిపూట కర్ఫ్యూ ఉన్న సమయంలో ప్రయాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయని, అయినా కూడా ప్రత్యేక కేసుగా విశాఖ పర్యటనకు, అక్కడి నుంచి అమరావతి పర్యటనకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

సరిగ్గా ఇక్కడే బాబు అభిమానులు ఫైరవుతున్నారు! కేంద్ర హోంశాఖ చెప్పినట్లుగా 65ఏళ్ల పైబడినవారి ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే… తమ నాయకుడికి 70 దాటేశాయని.. ఆయన ఆరోగ్యం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నారు! ఇందులో భాగంగా… రాత్రిపూట ప్రయాణాలు చేయనివ్వొద్దని.. తమ నాయకుడికి కూడా ఒకసారి కరోనా పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ వస్తే క్వారంటైన్ కు పంపాలని… నెగిటివ్ వస్తే హోం క్వారంటైన్ లో ఉండేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు! మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version