నంద్యాలకు సండే ఎమ్మెల్యే ఏమైనా చేశాడా : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సముద్రంలా తరలి వచ్చిన జనాన్ని చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడి పోవడం ఖాయమన్నారు. నంద్యాల చరిత్ర కలిగిన ప్రాంతమని, పీవీ నరసింహారావు గెలవడానికి టీడీపీ పోటీ పెట్టలేదన్నారు. నంద్యాలకు సండే ఎమ్మెల్యే ఏమైనా చేశాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందని, ఓర్వకల్లు ఏయిర్ పోర్టు నేను కడితే సిగ్గులేని ముఖ్యమంత్రి స్టిక్కర్ వేసుకున్నాడన్నారు. తంగడంచ మెగా సీడ్ పార్క్.. ఓర్వకల్లులో పరిశ్రమలు పూర్తి చేసుంటే, ఎన్నో ఉద్యోగాలు వచ్చి ఉండేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘కర్నూలు నంద్యాల జిల్లాలకు ఒక్క పరిశ్రమ వచ్చిందా. పిల్లల కోసమే నా తపన. కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ముచ్చుమర్రి, గోరుకల్లు, పులిచింతల ప్రాజెక్టులను నేను నిర్మిస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేక పోయారు. టమోట ధర లేక రైతులు చార్జీలు కూడా రావడం లేదని రైతులు మార్కెట్ లో పారబోసి పోతున్నారు. రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జగన్ రాయల ద్రోహి. ఫ్యాన్ ను గిరగిర వెనక్కి తిప్పి ముక్కలు వేసి భూమి లో పాతి పెట్టాలి. రేపు ఉదయం వైసీపీ ప్రభుత్వం కరెంట్ వైఫల్యాలను మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇసుక దొరకడం లేదు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటోలపై పోలీసులు విచ్చలవిడిగా ఫైన్ లు వేస్తున్నారు. భారీ ఫైన్ ల వల్ల లారీ డ్రైవర్ లు కుదేలయ్యారు. భారతి సిమెంట్ ధరలు విపరీతంగా పెంచుతున్నాడు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు.’ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version