తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన ఫామ్ హౌస్ వదిలి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే ఇవాళ కెసిఆర్ అధ్యక్షతన… టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. రేపటి నుంచి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూన్నారు.
అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, ఇతర సమస్యలపై… ఎలా పోరాడాలి అనే దాని పైన కేసీఆర్ చర్చించబోతున్నారు. ప్రజల వద్దకు మరింత దగ్గర అయ్యేలా… కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశంలో… పూర్తి అంశాలపై కేసీఆర్ చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యులు అలాగే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి రానున్నారు.