తెలంగాణ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

-

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు స్పీడ్ పెంచారు. పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్ సభ, 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక పై దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండు జాబితాలు రిలీజ్ చేసిన టీడీపీ అధినేత తాజాగా మూడో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి చంద్రబాబు ఏపీలో ఎంపీ టికెట్ ఇచ్చారు. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు బాపట్ల ఏస్ సీ ఎంపీ టికెట్ కేటాయించారు. 1960లో హైదరాబాద్ లో జన్మించిన ఆయన NIT వరంగల్, అహ్మదాబాద్ IIM లో చదివారు. 1984లో ఐపీఎస్ గా ఎంపికై..మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడంలో కీలక పాత్ర పోషించారు. విజయవాడ సీపీ గా పనిచేశారు. ఈయన కొద్ది రోజుల క్రితం వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version