బ్రేకింగ్ : టీడీపీ నేత‌ల‌తో క‌లిసి ఢిల్లీకి చంద్ర‌బాబు..!

-

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు శనివారం టిడిపి నేతలతో క‌లిసి ఢిల్లీకి వెల్ల‌బోతున్నారు. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చంద్ర‌బాబు కేంద్ర హెం మంత్రి అమిత్ షాకు వివ‌రించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో వైపు దాడుల‌కు నిర‌స‌న‌గా చంద్ర‌బాబు రేపటి నుంచి నిరవధిక నిరసన దీక్షకు దిగ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జ‌రిపారు. న్యాయ నిపుణులతో రెండు గంటల నుంచి చంద్ర‌బాబు చర్చలు జ‌రిపారు.
పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉండాలని నాయకులను బాబు ఆదేశించారు.chandrababu naidu

ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచనలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఏపీ ప్ర‌భుత్వం పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖ కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా నిన్న టీడీపీ కార్యాల‌యం పై ప‌ట్టాభి ఇంటిపై జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ రోజు ఏపీలో బంద్ కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థ‌లు వ్యాపారాలు బంద్ పెట్టాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version