ప్రతి పల్లెకు వస్తా…వైఎస్.ఆర్ నాయకత్వం తీసుకువస్తా : షర్మిల

-

ప్రతి పల్లెకు వస్తా… వైఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకువస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని… ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశిస్తామని తెలిపారు..ఇవాళ చేవేళ్లలో పాదయాత్ర ప్రారంభించారు వైఎస్‌ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నానని… కేసీఆర్ కుటుంబ పాలన అంతానానికే ఈ యాత్ర, కోట్ల అప్పులు తెచ్చిన కులం, మతం పేరిట చిచ్చు పెట్టిన బీజేపీని గంగలో కలిపినందుకే..ఈ యాత్ర అని చెప్పారు.

టిఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెందడానికె ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు…ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. నంబర్ వన్ అద్వన్నమైన సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని… చురకలు అంటించారు. పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారు…కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయారని మండిపడ్డారు. కళ్ళ ముందు లక్ష 90వేల ఉద్యోగాలు ఉన్నా భర్తీ చేయలేదని నిప్పులు చెరిగారు. వేల కోట్ల సంపదను నీటిపాలు చేస్తున్నారని… ఆరేళ్ళ పసిపాపపై అత్యాచారం జరిగిన ఈ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version