గుప్పెడంతమనసు 273 ఎపిసోడ్: బాంబ్ పేల్చిన శిరీష్.. తన జీవితంలో వసూ చేతుల్లో ఉందని శిరీష్ చెప్పే మాటలను విన్న రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి, వసు హాల్ లో కుర్చుని ఉంటారు. ఉదయం రిషీ అన్న మాటలను తలుచుకుంటుంటారు. జగతి మళ్లీ వసూ నువ్వెందుకు వచ్చేశావ్, ప్రోగ్రామ్ లో నుండి ఇక్కడికి వచ్చేసి నా మీద గురుభక్తిని చాటుకున్నా అనుకుంటన్నావా అంటుంది. మేడమ్ అక్కడ మీరు లేకపోతే నెనెలా ఉండాలి, అసులు నేనెందుకు ఉండాలి అంటుంది వసూ. నేను లేనందుకైనా ఉండాల్సింది, రిషీకి నా మీద కోపం, చెప్పలేనంత ద్వేషం, కానీ రిషీకి నీ మీద బోల్డెంత నమ్మకం, రిషీ నమ్మకాన్ని తుంచేశావ్ అంటుంది జగతి. అలా ఎలా మేడమ్ నాకు ముందు మీరు ఆ తర్వాతే రిషీ సార్ అంటుంది వసూ. ఎవరు ముందు ఎ‌వకు వెనుక కాదు వసుధార, భాద్యత అని ఒకటి ఉంటుంది కదా, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి నువ్వు రిషీకి అసిస్టెంట్ వి, ఆ విషయం మర్చిపోయావా,ఆ పనికి నువ్వు నెలనెలా శాలరీ తీసుుకుంటున్నావా, అలాఎలా వచ్చేస్తావ్ అంటుంది జగతి. మీరు ఆ ప్రాజెక్టుగి హెడ్ మరి మీరు ఎందుకు వచ్చేశారు అంటుంది వసు. నన్ను ప్రశ్నిస్తున్నావా అంటుంది జగతి. ఎందుకు వచ్చానో నాకు తెలుసు, ఎందుకు రావాల్సింది వచ్చిందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు , కానీ నా సంతోషం కోసం రిషీని బాధపెట్టం కరెక్టుకాదు అంటుంది జగతి. నేను ఎవరి సంతోషం కోసం ఏపని చేయను మేడమ్..ఆఖరికి మీరైనా సరే..నా మనసుకు నచ్చింది, కరెక్టు అనిపించిందే చేస్తాను మేడమ్ అని చెప్పి వసూ లేచి వెళ్లిపోతుంది.

జగతికి మహేంద్ర కాల్ చేస్తాడు. పాపం ఇతనికి ఏం తెలయదుగా..జగతి నా సంతోషానికి హద్దులు లేవు తెలుసా అంటాడు. ఇద్దరు రిషీ ఇంటర్వూ గురించి మాట్లాడుకుంటారు. వసూ వచ్చాక రిషీలో మార్పు వచ్చింది అని మహేంద్ర అంటాడు. ఇంకోపక్క రిషీ వస్తూ ఉంటాడు. రిషీ వజ్రం, వజ్రం సానబట్టపడుతుంది. జగతి నాకు తెలియదా ఎప్పుడేం మాట్లాడాలో అంటాడు. ఇవన్నీ మనోడు వింటూనే ఉంటాడు.జగతి బాయ్ చెప్పి కాల్ పెట్టేస్తుంది. మహేంద్ర రిషీ కమ్ కమ్ ..ఎప్పుడు వచ్చావ్ అంటాడు. మాటలు విన్నావా అని డైరెక్టుగా అడగొచ్చుగా డాడ్, నాకు అవసరంలేనివి నేను అసలు పట్టించుకోను అంటాడు రిషీ.మహేంద్ర నువ్వు ఇంటర్వూలో భలే మాట్లాడావ్ తెలుసా..నేను అసలు ఊహించలేదు అంటాడు. అంటే నా తెలివితేటల మీద మీకు నమ్మకం లేదనమాట అంటాడు. అలా కాదు రిషీ..సంతోషంలో మాటలు తడబడ్డాయ్ అంటాడు మహేంద్ర. రిషీ లవ్ యూ డాడ్ చెప్పి..నా ప్రతి విజయం వెనుక మీరు ఉంటారు..నా అనుకున్న సంతోషం మీదు కూడా అని కౌగిలించుకుంటాడ. మహేంద్ర ఉప్పొంగిపోతాడు. రిషీ మారేదాక మనం ఎదురుచూడాల్సిందే, మారుతున్నాడు ఇంకా ఇంకా మారాలి, వసుధార కచ్చితంగా మారుస్తుంది అనుకుంటాడు.

వసూ రూంలో రిషీతో సీరియస్ ఇంటర్వూకి రాను అని చెప్పిన మాటలు, ఇంతకముందు జగతి అన్న మాటలు తలుచుకుని రిషీ సార్ కి నా మీద నమ్మకం పోయి ఉంటుంది..చిన్న చిన్న మాటలకే బాగా ఫీల్ అయ్యే రిషీ సార్ ఇప్పుడేంచేస్తున్నారు, వసూ వేస్ట్ అనుకుంటున్నారా అనుకుంటుంది. ఇటుపక్క రిషీ కూడా వసూ అన్న మాటలను తులుచుకుంటాడు. వసూ సారీ సార్ అని మెసేజ్ చేస్తుంది. వసూ మెసేజ్ చూశారు రిప్లైయ్ ఇవ్వలేదు అనుకుంటుంది. మనోడు చూస్తాడు కానీ రిప్లైయ్ ఇవ్వడు. చేసిందంతా చేసి సారీ చెప్తే అయిపోతుందా అనుకుంటాడు. వసూ సార్ బాగా కోపంగా ఉన్నట్లు ఉన్నారు అనుకుని పక్కనే ఉన్న బుక్ తీసుకుని దానిపై ఒక బొమ్మవేసి సారీ సార్ అని రాసి ఫొటో తీసి పెడుతుంది. రిషీ ఫోన్ చేసి తిట్టేస్తే తిక్కకుదురుతుంది.. నీ సారీలకు కరగను మెసేజ్ చేస్తే..అసలు తనుకు నేనెందుకు రెస్పాండ్ అవ్వాలి అని ఏం చేయడు. వసూ మళ్లీ బుక్ మీద నాలుగు సార్లు సారీ సార్ అని రాసి ఫోటో తీసు పంపుతుంది. ఏంటి వసుధారకు ఏమైంది. మెసేజ్ చూస్తాన్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటాడు. వసూ వాయిస్ మెసేజ్ చేస్తుంది. నేను అసలు వినను, చూడనే చూడను అని ఫోన్ పక్కనేస్తాడు. మళ్లీ ఏం పెట్టి ఉంటుంది అనుకుని ఫోన్ తీసి వింటాడు.

ఇటుపక్క వసూ ఏంటి సార్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటుంది. ఇంతలో జగతి వస్తుంది. ఏం చేస్తున్నావ్ అంటే వసూ చేసేది చెప్తుంది. కోపంగా ఉన్నవాళ్లను వదిలేయాలి, విసిగించకూడదు అంటుంది జగతి. సరే మేడమ్ అని వసూ చెప్తుంది. ఇటువైపు రిషీ..వసూ పెట్టిన మెసేజ్ స్ అన్నీ చూసుకుని ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేస్తుందా ఏంటి అనుకుంటాడు. కట్ చేస్తే తెల్లారిపోతుంది.

శిరీష్ జగతి ఇంటికి వస్తాడు. తనేంటో టెన్షన్ లో ఉన్నావని ఇలా డల్ గా వెళ్తే బాగుండదు..కొంచెం చిరునవ్వు అప్పుతెచ్చుకోబాబు అని తనలో తనే అనుకుని నవ్వుతూ వెళ్తాడు. జగతిని పలకరించి..ఇంటర్వూలో రిషీ సార్ అద్దరగొట్టేశారు అని రిషీ సార్ పక్కన మీరు కానీ వసూ కానీ లేరేంటి మేడమ్ అంటాడు. ఇంతలో వసూ కంగారుగా వస్తుంది. శిరీష్ పలకరించినా ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. జగతి కాఫీ తెస్తాను అని చెప్పి వస్తుంది. శిరీష్ నా ప్రాబ్లమ్ చెప్దాం అంటే వసూ లోపలికి వెళ్లిపోయిందేంటి అనుకుంటాడు.

వసూ రూంలోకి వచ్చి రిషీ సార్ ఇంకా రిప్లైయ్ ఇవ్వలేదేంటి అనుకుని తెగ బాధపడుతుంది. జగతి ఏంటి వసూ అలా వచ్చావ్ అంటే..మేడమ్ రిషీ సార్ ఇంకా రిప్లైయ్ ఇవ్వలేదు, నా మీద ఇంకా కోపం తగ్గలేదు అని చెప్తుంది. రిషీ కోపంలో న్యాయం ఉంది. ఇంటికొచ్చిన శిరీష్ ని వదిలేసి ఇప్పుడు రిషీకోసం బాధపడటం కరెక్టేనా అంటుంది జగతి, కాలేజ్ కి వెళ్లాక రిషీతో మాట్లాడి ఏదోఒకటి సర్దిచెప్పు, ఇప్పుడు వెళ్లి శిరీష్ తో మాట్లాడు, ఎడ్యూకల్చర్ లో శిరిష్ మనకెంత హెల్ప్ చేశాడో తెలుసు కదా అని చెప్పి పంపిస్తుంది.

వసూ శిరీష్ దగ్గరకు వెళ్తుంది. వసూ నాకు చిన్న ప్లాబ్లమ్ ఉంది అది నువ్వే సాల్వ్ చేయాలి అంటాడు. నీకేంటి సమస్య, ఏసీపీ నీకేంటి సమస్య అని అరుస్తుంది. నువ్వు ఈరోజు కాలేజ్ కి వెళ్లొద్దు అంటాడు శిరీష్..నేను అసలే ఇంటర్వూకి వెళ్లలేదని రిషీ సార్ కోపంగా ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ కి కూడా వెళ్లకపోతే ఎలాగా..నేను కచ్చితంగా కాలేజ్ కి వెళ్లాలి రిషీ సార్ ని ప్రసన్నం చేసుకోవాలి అంటుంది. ఇంతలో జగతి కాఫీ తీసుుకని వస్తుంది. శిరీష్ జగతికి చెప్తాడు..అటుచేసి ఇటుచేసి జగతి సరే వసూని కాలేజ్ లో డ్రాప్ చేయిదారిలో తనతో మాట్లాడు అంటుంది. శిరీష్ థ్యాంక్స్ మేడమ్ అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో శిరీష్ వసూని కాలేజ్ లో డ్రాప్ చేసి వసూ చేతులు పట్టుకుని నాజీవితంలో ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అంటాడు. అసలు ఈ శిరీష్ ఏం చెప్పాడో చూపించరు. ఇదికాస్స రిషీ చూసేస్తాడు. మరోసీన్ లో వసూ డల్ గా ఉంటే పుష్సా అడుగుతుంది. శిరీష్ తన మనసులో మాట చెప్పాడు., పెద్ద బాంబ్ పేల్చాడు, శిరీష్ మంచివాడు, ఏ ఆడపిల్ల అయినా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది అంటుంది వసూ. ఈ మాటలన్నీ వెనకే ఉన్న రిషీ వింటాడు. వసూ మాటలను బట్టి చూస్తే శిరీష్ ప్రపోజ్ చేశాడనే అనుకుంటాడు రిషీ. చూద్దాం ఏమవుతుందో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version