45వేల కోట్లను చేబదులుగా తీసుకున్న చంద్రబాబు!

-

తాము అధికారంలో ఉన్నప్పుడు అడిగేవాడు లేడు అనేది అధికారంలో ఉన్న వారి ధైర్యమో, ప్రతిపక్షాలు చెప్పినా మీడియా వారి గొంతుకను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జరిగిన లోపమో తెలియదు కానీ… తమకు ఇష్టం వచ్చినట్లు కొందరి పాలన సాగుతుంటుంది.. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థలు వంటివి విచారించి అక్షింతలు వేస్తే.. అప్పుడు అసలు బండారం బయటపడుతుంది! అప్పటివరకూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలను రాజకీయ విమర్శలుగానే చూడాల్సిన పరిస్థితి!

ఈ క్రమంలో… 2017 – 18 సమయంలో బాబు చేసిన నిర్వాకాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెలుగులోకి వచ్చింది! బాబు తన హయాంలో బడ్జెట్‌ కేటాయింపులు భారీగా చేసి, ప్రజల్లకు ఇచ్చే మాటలు కోట్ల దాటించి.. ఖర్చు చేయకుండా చేతులెత్తేసిన వైనాన్ని తేటతెల్లం చేసింది కాగ్ నివేదిక!

అప్పులు తెచ్చి దుబారా చేయడం వల్ల రాష్ట్రాన్ని టీడీపీ సర్కార్‌ ఆర్థికంగా చావుదెబ్బ తీసిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక తేల్చింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి విద్యారంగంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్‌ లో కేటాయింపులను భారీగా చూపించి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపిందని తేల్చింది.

అప్పటి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో.. ప్రతి కేటాయింపులో 21 విభాగాల గ్రాంట్లకు సంబంధించిన మొత్తం 24,357.29 కోట్లు మిగిలిపోవడంపై కాగ్‌ కడిగి పారేసింది. ఈ విషయంలో మరింత ఫైరయిన కాగ్… 2018 మార్చి నాటికి అప్పులు రూ.2,23,706 కోట్లకు పెరిగాయని.. ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా బాబు నాడు చేసిన నిర్వాకాల్లో కాగ్ నివేదీకలో వెళ్లడిచేసిన వాటిలో.. అందరికీ అర్ధమయ్యే ఉదాహరణ ఒకటి ఇప్పుడు చ్చూద్దం! రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి 231 రోజులు చేబదులుగా (వేజ్‌ అండ్‌ మీన్స్‌), ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ.45,860.75 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పుగా తీసుకుంది! అంతేనా… వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో మరో రూ.44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందంట. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కారు వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్‌ పేర్కొంది. కాగ్ నివేదికలో ఇవి కొన్ని ఉదాహ్రణలు మాత్రమే…! దీనిపై స్పందించిన అధికార పక్ష నేతలు… నాడు వైకాపా చేసిన విమర్శలే నేడు కాగ్ తేల్చిందని అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version