కొణిదెల వారి పెండ్లి పిలుపు.. మెగా ఫాన్స్ కి పండగే..!

-

మెగా బ్రదర్ నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి కూడా. అయినా అవన్నీ పుకార్లగానే మిగిలిపోయాయి తప్ప దేనిపైనా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నిహారిక పెళ్లి విషయమై ఒక క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. పైగా ఈ క్లారిటీ ఇచ్చింది కూడా నిహారికే. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహ’ అని రాసి ఉంటుంది. అయితే, దానిలో ‘మిస్‌’ కొట్టేసి దాని కిందే ‘మిసెస్’ అని నిహారిక రాసింది. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ఆమెను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిహారిక పెళ్లిని ఎవరితోనో నిశ్చయం చేశారని చర్చ కొనసాగుతోంది. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే నిహారికకు త్వరలో పెళ్లి చేస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించడంతో నిహారిక పెళ్లి ఫిక్స్ అయిపోయిందని మెగా అభిమానుల్లో టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version