ప్రజలకు అల్జీమరి వ్యాది లేదు… పుష్కరాల ఘటన గుర్తుచేస్తోన్న చంద్రబాబు!

-

తాజాగా చంద్రబాబు ఆన్ లైన్ లో ప్రెస్ మీట్ పెట్టారు! తాను ఏమి మాట్లాడుతుందీ.. ఎంత స్పష్టంగా మాట్లాడుతుందీ.. అసలు మాట్లాడుతున్న వాటిలో ఎంత అర్ధం ఉందీ… అన్న విషయాలపై లైట్ తీసుకుంటూనే మొదలైన ఆ ప్రెస్ మీట్ లో బాబు మాట్లాడిన ప్రతీ మాటలోనూ, చేసిన ప్రతీ విమర్శలోనూ పుష్కరాల సమయంలో జరిగిన 29 మంది ఘోర మరణాల సంఘటనే గుర్తుకు వచ్చేలా మాట్లాడారు! ఈ సందర్భంగా… ప్రజల ప్రాణాల గురించి.. వాటి విలువ గురించి.. తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని చెప్పిన విషయం గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఇంతకూ ప్రజల ప్రాణాలు, విశాఖ గ్యాస్ లీక్ వ్యవహారం, కేంద్రానికి తాను రాస్తోన్న లేఖలు, విశాఖ వెళ్లడానికి ముహూర్తం ఎప్పుడు, కోటి రూపాయల నష్ట పరిహారం, జగన్ హుటాహుటిన వైజాగ్ వెళ్లడం, టీడీపీ తరుపున విశాఖ వాసులకు ధైర్యం చెప్పడానికి పంపుతున్న ఒక టీం… మొదలైన విషయాలపై బాబు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం!

ప్రజలకు అల్జీమరి వ్యాది ఉందనుకుంటారో ఏమో తెలియదు కానీ… తాను చేసింది జనం అంతా మరిచిపోయారు కాబట్టి తాను ఏమి మాట్లాడినా, ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది అని భావిస్తున్నట్లున్నారు చంద్రబాబు! తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12మంది చనిపోవడం, 44 మంది పిల్లలతో సహా సుమారు 350 మంది ఆస్పత్రిలో ఉండటం తనకు చాలా బాదవేసిందని, తనకు రాత్రంతా నిద్రపట్టలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రధానికి, హోం డిపార్ట్ మెంట్ కి లేఖలు రాశానని చెప్పారు. ఇదే క్రమంలో తాను కూడా విశాఖ వెళ్లడానికి అనుమతి కావాలని… ఇప్పటికే కేంద్రానికి చాలా లేఖలు రాశానని, కాని ఇంకా అనుమతి రాలేదని, ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదని… కాని పర్మిషన్ వచ్చిన అనంతరమే తాను విశాఖకు బయలుదేరి వెళ్తానని చెప్పుకొచ్చారు! అసలు బాబు విశాఖ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఎందుకు? తనకు ప్రయాణానికే అనుమతి ఇవ్వడంపై రాసిన లేఖలకే స్పందించని కేంద్రం… మిగిలిన విషయాలపై బాబు రాసిన లేఖలకు స్పందిస్తుందా?

ఇక ఇదే విషయంలో… విశాఖలో జరిగిన సంఘటన మానవ తప్పిదమా… టెక్నికల్ ప్రమాదమా అన్న విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని బాబు సూచిస్తున్నారు. అది మానవతప్పిదమైనా తప్పే.. టెక్నికల్ తప్పిదమైనా తప్పే అని… ఆ కంపెనీ తెరవడం ఈ సమయంలో అత్యవసర విషయం కాదని అంటున్నారు! మీడియం స్థాయి కంపెనీలు తెరవచ్చని, తద్వారా కార్మికులకు వచ్చే నెలనుంచైనా జీతాలు వస్తాయని కేంద్రం సూచించిన సంగతి బాబు మరిచినట్లున్నారు! అసలు ఈ సమయంలో… అవగాహన లేకుండా.. కంపెనీ తెరవడం గురించిన కామెంట్ అవసరమా?

ఇక ముఖ్యమంత్రి విశాఖ వెళ్లడం, నష్ట పరిహారం ప్రకటించడం, అధికారులతో మాట్లాడటం, ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతాంపై కూడా బాబు స్పందించారు! కోటి రూపాయలు పరిహారం ఇస్తే… పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా, కోటి ఇవ్వడం గొప్పకాదు, ఇలాంటివి జరగకుండా చూడాలి అంటున్నారు!! ప్రమాదాలు చెప్పి జరగవు… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి.. ఈ విషయాలు బాబుకి తెలియదా? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దుర్ఘటనల్లో 10 లక్షలు, 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎందుకు ప్రకటించినట్లో బాబుకే తెలియాలి? బాబు హయాంలో అనుకోకుండా జరిగిన దుర్ఘటనలు ఒకెత్తుయితే… ప్లాన్ చేసి మరీ కార్యక్రమం ఏర్పాటుచేసి, అవగాహనా లోపంతో, పబ్లిసిటీ యావతో, ప్రజల యోగక్షేమాలపై పరిపూర్ణమైన బాద్యతారాహిత్యంతో 29మంది మరణాలకు కారణం అయ్యి, దానిపై ఇప్పటికి కూడా విచారణ పూర్తి కానివ్వని పుష్కరాల ఘటనను ఏమనాలో బాబే చెప్పాలి!

ఇక ఈ దుర్ఘటన జరిగిన సాయంత్రం కూడా గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉండొచ్చు… కాస్త సేఫ్ జోన్ ల్లోకి వెళ్లాలని వాలంటీర్లతో, పోలీసులతో హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా బాబు తప్పుబడుతున్నారు. కరోనా గురించి భయపడకండి.. జాగ్రత్తగా ఉంటే చాలు అని జగన్ ప్రకటిస్తే… లైట్ తీసుకున్నారని చెప్పిన బాబే… ఈ విషయంలో ప్రజలను హెచ్చరిస్తే… భయబ్రాంతులకు గురిచేశారు అని చెబుతున్నారు. ఈ విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలో చంద్రబాబే చెప్పాలి. అలాంటి సంఘటన జరిగిన చోట… హుటాహుటిన జనాలను ఖాళీ చేయించడం వల్ల, జనాలు ప్యానిక్ అయిపోయారని కామెంట్ చేయడం బాబుకే చెల్లింది!

ముఖ్యమంత్రి అవగాహనా లోపంతో ప్రవర్తిస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు విశాఖ వెళ్లి అక్కడే ఉండాలి తప్ప వెంటనే వచ్చేయకూడదనేది బాబు మరో విమర్శ! విశాఖలో తుఫాను వచ్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తాను విమానంలో విశాఖ వెళ్లానని, బ్యాగ్ కూడా తీసుకువెళ్లాన్నని, అక్కడే చాలా రోజులు ఉన్నానని, జగన్ మాత్రం వెంటనే వెళ్లిపోయారని విమర్శిస్తున్నారు చంద్రబాబు. సమర్ధత ఉన్నప్పుడు, పరిపాలనపై పట్టు ఉన్నప్పుడు… సమస్య వచ్చిన ప్రతిచోటా ముఖ్యమంత్రి కాపురం పెట్టక్కరలేదు… సమన్వయలోపం లేకుండా చూసుకుంటే సరిపోతుంది కదా!! బాబుకి ఈ మాత్రం అర్ధం కావడం లేదు!

ఇక చంద్రబాబు చేసిన మరో విమర్శ…. తానే ముఖ్యమంత్రి అయితే గనుక నేరుగా ఫ్యాక్టరీ దగ్గరకే వెళ్లేవారంట! ఫ్యాక్టరీ దగ్గరకి టెక్నికల్ సిబ్బందిని పంపుతున్నామని ప్రకటించి, తాను అధికారులతో పరిస్థితిని సమీక్షించి, బాధితులను ఆస్పత్రిలో పరామర్శించి, నష్టపరిహారం ప్రకటించి, వారికి ధైర్యం కలిగించి జగన్ వచ్చారు తప్ప… ఈ సమయంలో జనాలను వదిలి, గ్యాస్ లీక్ ఆగిందో లేదో తెలియని ఫ్యాక్టరీ దగ్గరకు ముఖ్యమంత్రి వెళ్లలేదని కామెంట్ చేయడం… శవాలపై కూడా రాజకీయం చేయడం కాక మరేమిటో బాబే చెప్పాలి! ఇదే సమయంలో… కరోనాకి బయపడి హైదరాబాద్ దాటి రాని చంద్రబాబు… గ్యాస్ లీకవుతున్న ఫ్యాక్టరీ దగ్గరకి నేరుగా వెళ్లేవారంట? అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!!

మరో విషయం ఏమిటంటే… తాను విశాఖకు ఎప్పుడు వెళ్లాలి అనేది మోడీ చేతిలో ఉన్నది అని ఒప్పుకున్న చంద్రబాబు… తాను మాత్రం టీడీపీ తరుపున ఒక త్రీ మెంబర్స్ టీం ని పంపుతున్నానని ప్రకటించారు. వారిలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప ఉంటారని, వారు విశాఖకు వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతారని చెబుతున్నారు చంద్రబాబు. ఇక్కడ గమనించాల్సి మరో విషయం ఏమిటంటే… ఆ ముగ్గురు విశాఖకు వెళ్లాలన్నా ఏపీ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలి!! అక్కడ అనుమతి అడగడానికి రాని బేషిజం… తనకు అడగడానికి ఎందుకో బాబుకే తెలియాలి!! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… జనాల దగ్గరకు నిజంగా తాను వెళ్లడమే ముఖ్యమైతే… హుటాహుటిన కారులో అయినా వెళ్లిపోవచ్చు.. దానికి కేంద్రానికి జాబు రాసి, జవాబు కోసం ఎదురుచూడనక్కరలేదు! ఏపీ డీజీపీ కి ఒక ఫోన్ చేస్తే చాలు! అంటే అక్కడ జనాలు ఏమైపోయినా పర్లేదు కానీ.. తనకు మాత్రం ఫ్లైట్ లో వెళ్లడమే ముఖ్యమన్నమాట!!

ఏది ఏమైనా… చంద్రబాబు ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం వల్ల, చావు బ్రతుకలనే తేడా లేకుండా ప్రతీ విషయంలోనూ రాజకీయ ఉపన్యాశాలే చేయడం వల్ల.. ఇంకా ప్రజలకు దూరం అవుతున్నారేమో అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా తాను అధికారంలో ఉండగా చేసిన తప్పు ఆలోచనలు, తీసుకున్న తప్పు నిర్ణయాలు, చేసిన తప్పు పనుల ఫలితమే నేటి పరిస్థితీ అని, ప్రజలకు అల్జీమర్ వ్యాది లేదని బాబు నమ్మాలని పలువురు కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version