మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఔరంగాబాద్ జల్నా మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలు అయ్యాయి. మధ్యప్రదేశ్ వెళ్ళాలి అనుకునే వలస కార్మికులు పట్టాల మీద నిద్రించారు. అయితే ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వలస కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.
అసలు రైలు పట్టాల మీద వాళ్ళు ఎందుకు నిద్రపోయారు అనేది అర్ధం కావడం లేదు. రైలు పట్టాల మీద రైలు వస్తుంది అనే విషయం అందరికి తెలుసు. మానసికంగా సరిగా లేని వ్యక్తికి కూడా రైలు పట్టాల మీద రైలు వస్తుంది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు వాళ్ళు సొంత ఊర్లకు వెళ్ళలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని అక్కడి అధికారులు భావిస్తున్నారు. వాళ్ళు నడిచి నడిచి విసిగిపోయారని సమాచారం.
అందుకే రైలు పట్టాల మీద పడుకుని అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు అని తెలుస్తుంది. ఇది కచ్చితంగా ప్రమాదం కాదు అని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ విచారణ మొదలుపెట్టింది. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఆసలు ఎం జరిగింది అనేది అర్ధమవుతుంది. ఈ ఘటనపై కేంద్రం కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది.