ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. ఈసీకి చంద్రబాబు లేఖ

-

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని తెలిపారు. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని.. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుందని ఫైర్‌ అయ్యారు.

డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికేట్‌లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని.. తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని మండిపడ్డారు. తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారని.. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ తో ఓటర్లుగా చేరారన్నారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలను పరిశీలించకుండానే, ఉద్దేశ్య పూర్వకంగానే ఆమోదం తెలిపారని.. తిరుపతిలో 44వ డివిజన్‌లో చికెన్ దుకాణం అడ్రస్సుతో కూడా 16 బోగస్ ఓట్లు నమోదు చేశారని నిప్పులు చెరిగారు. ఇలా పలు ప్రాంతాల్లో బోగస్ ఓట్ల తంతు ఉందని.. బోగస్‌ ఓట్లపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version