ఆ ఫోన్ ఎత్తితే అకౌంట్ ఖాళీ..జాగ్రత్త పడకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..

-

ఈ రోజుల్లో అన్నీ పనులు ఇంట్లోనే జరిగిపోతున్నాయి.. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్ పనులను ఎక్కువగా ఆన్లైన్లో చేస్తున్నారు.. ఆన్‌లైన్‌, స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా చేస్తున్నారు. అయితే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఒక చిన్న పొరపాటు జరిగితే మాత్రం అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది.. ఎందుకంటే సైబర్‌ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేరస్తులు తెలివిగా సమాచారం సేకరించి బ్యాంకు ఖాతాను నిమిషాల్లో ఖాళీ చేస్తున్నారు. దీని కోసం వివిధ పద్దతులని అనుసరిస్తున్నారు. అందులో ఒకటి విషింగ్‌ పద్దతి. దీనిని ఎలా నివారించాలో ఈరోజు తెలుసుకుందాం…

విషింగ్ ద్వారా నేరస్థుడు మన డిటైల్స్ ను లాగే ప్రయత్నం చేస్తాడు.. కూల్ గా మాట్లాడి నమ్మిస్తాడు. తాము బ్యాంకు ప్రతినిధులమని చెప్పుకుంటూ వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టుకుంటారు. వీటిలో వినియోగదారు ID, లాగిన్, పాస్‌వర్డ్, OTP, ఏటీఎం కార్డ్ పిన్, CVV లేదా పుట్టిన తేదీ, తల్లి పేరు మొదలైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. తర్వాత మీ ఖాతానుంచి డబ్బు దొంగిలించడానికి ఈ వివరాలని ఉపయోగిస్తారు..ఇదంతా కేవలం క్షణాల్లో జరిగిపోతుంది.

ఇలాంటి వాటి నుంచి ఎలా అలెర్ట్ అవ్వాలంటే?

*. మీ వ్యక్తిగత వివరాలని ఎవరికీ షేర్‌ చేయవద్దు. మొదటి, చివరి పేరు వంటి వ్యక్తిగత వివరాలను అడిగే కాలర్ పట్ల జాగ్రత్తగా ఉండండి..

*. ఏదైనా మెస్సేజ్‌ ద్వారా వచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్ చేయవద్దు. వ్యక్తిగత లేదా ఖాతా వివరాలను చెప్పొద్దు..

*. ఏదైనా మెయిల్ కు వచ్చిన నంబర్ కు అస్సలు కాల్ చెయ్యకండి..

*. ఏదైనా నెంబర్‌కి కాల్‌ చేసేటప్పుడు అది బ్యాంకు నెంబరా కాదా విషయాన్ని చెక్ చేసుకోవాలి..

*. మీరు క్రెడిట్ లేదా డెబిట్ సమాచారం కోసం ఏదైనా SMS లేదా కాల్‌ని స్వీకరిస్తే ఎటువంటి సమాచారాన్ని తెలియజేయవద్దు.

*. బ్యాంకుకు సంబందించిన సమాచారన్ని దగ్గరలోని బ్యాంకు కు వెళ్లి తెలుసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version