ఏపీ అప్పు 7 లక్షల కోట్లకు చేరింది..చరిత్ర నిన్ను క్షమించదు : జగన్‌ పై చంద్రబాబు ఫైర్‌

-

ఏపీ అప్పు 7 లక్షల కోట్లకు చేరింది..చరిత్ర నిన్ను క్షమించదని జగన్‌ పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లు అని.. ఇప్పుడు ఏపీకి ఉన్న అప్పు 7 లక్షల కోట్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పై లక్ష రూపాయల అప్పు భారం ఉందని.. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదంటూ నిప్పులు చెరిగారు. అవినీతిని ఈ ప్రభుత్వం వ్యవస్థీకరించిందని.. భూగర్భ ఖనిజ సంపద మొత్తం వైసీపీ నేతలు దోచేశారని నిప్పులు చెరిగారు.

సెటిల్మెంట్ లు, జగన్ కు మాత్రం లక్షలాది కోట్ల రూపాయల కావాలని.. రాష్ట్రంలో ఇంకెవ్వరూ నిజాయితీగా కూడా ఒక రూపాయి కూడా సంపాదించటానికి లేదని నిప్పులు చెరిగారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై శ్వేత పత్రం విడుదల చేయాలని.. ప్రభుత్వం అడుక్కునే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డారు.

వాళ్ళ ఎమ్పీలే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అని పార్లమెంటులో చెప్పారని వెల్లడించారు. దీనికి కారణం జగన్ కాదా?? అని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, నాలెడ్జ్ సిటీ ఇలా ఎన్నో హైదరాబాద్ లో ఏర్పాటు చేశానని.. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఎకరం ధర 60లక్షల వరకు ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన మిమ్మల్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version