వల్ల ఉపయోగాలే తెలుసు కానీ.. ఉల్లిపొట్టు వల్ల ఏం యూస్ లేదనుకుని.. కట్ చేసినప్పుడు తీసేసి డస్టబిన్ లో వేస్తాం.. ఇప్పుడు ఈ ఉల్లిపొట్టుతో కూడా లాభాలున్నాయ్ అని తెలిస్తే.. చక్కగా వాడుకోవచ్చు కదా.. ఇంతకీ ఆ పొట్టుతో ఏం చేస్తారబ్బా అనే కదా మీ డౌట్..!
టీ తాగే అలవాటు ఉన్నవారు.. కనీసం రోజుకు ఒకసారైనా ఉల్లిపాయ తొక్కను కలుపుకుని టీ తాగవచ్చు. ఉల్లిపాయ తొక్కలో విటమిన్ A తో సహా అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడుతుంది.. ఉల్లిపాయ పొట్టు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య కూడా దూరమవుతుంది. చర్మంపై కొత్త కణాలు ఏర్పడతాయి
ఉల్లిపొట్టును నీటిలో వేసి మరిగించి.. నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది . చుండ్రు సమస్యను కూడా తగ్గుతుంది. ఉల్లి తొక్కలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ నీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది.
సీజన్‌లు మారుతున్న సమయంలో మనకు తరచుగా దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. వీటన్నింటిని ఎదుర్కోవడంలో ఉల్లిపాయ తొక్క బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్కలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వైరల్ వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ తొక్క కలిపిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
కాళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరితో బాధపడుతున్న వారు ఉల్లిపాయ పొట్టుతో చేసిన టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ తొక్కలను 1 గ్లాసు నీటిలో వేసి 15 నిమిషాలు మరగపెట్టాలి. తర్వాత.. ఫిల్టర్ చేసి తాగాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
ఉల్లిపాయ తొక్క యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దురద వంటి సమస్యలను తొలగిస్తాయి. ఉల్లిపాయ తొక్కను నీటిలో బాగా మరగబెట్టాలి. ఆ నీరు చల్లారిన తర్వాత ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ నీటిలో దూదిని ముంచి.. చర్మంపై అప్లై చేస్తే ఆ ప్రాంతంలో దురద సమస్యలు తగ్గుతుంది.
ఓర్ని ఇన్ని లాభాలు ఉన్నాయా ఉల్లిపొట్టులో..మనం ఇన్ని రోజులు అనవసరంగా పొట్టు పారేశాం అనిపిస్తుందా..మరి ఇంకెందుకు లేట్..ఈ సారి ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు ఇలా వాడి చూడండి.!
-Triveni Buskarowthu