చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

-

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసిపి చేసిన దాడికి నిరసనగా… ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… చేపట్టిన దీక్ష కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఈ నిరసన దీక్షను చేపట్టారు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు. ఈ దీక్షను ఘటన జరిగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లోనే 36 గంటల పాటు చేయనున్నారు చంద్రబాబు.

పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే ఈ దీక్షా వేదికను ఏర్పాటు చేశారు టిడిపి నేతలు. ఇక చంద్రబాబు దీక్షకు వివిధ జిల్లాల నుంచి టిడిపి కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు మరియు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివస్తున్నారు.

దీక్ష శిబిరం లో కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి గుంటూరు అర్బన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేతలు మరియు కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అసలు అనుమతిస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. ఇదిలా ఉంటే…తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ నిన్న అరెస్ట్ అయ్యారు. తలుపులు పగల కొట్టి మరీ పట్టాభిని అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version