టిడిపి అధినేత చంద్రబాబు ఎంతటి రాజకీయ మేధావి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సందర్భంలోనూ ఆయన తన రాజకీయ చాణిక్య త నిరూపించుకుంటూ వస్తారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి, ఎన్నో విపత్కర పరిస్థితులను దాటుకుంటూ విజయాలు సాధిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగానే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు, ప్రపంచ దేశాల్లోనూ చంద్రబాబు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలా చేసుకోగలిగారు. ఇక చేసింది తక్కువే అయినా, దానిని గొప్పగా ప్రచారం చేసుకుని పేరు ప్రఖ్యాతలు సంపాదించడం లో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు ఉండరు. అంతటి రాజకీయ చాణక్యుడికి ఉన్న బాబుకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది.
నిత్యం మనశ్శాంతి లేకుండా చేస్తోంది. 70ఏళ్ల వయసులో హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన చంద్రబాబు మనోవేదనకు గురవుతున్నారు. తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రకటించి చి టిడిపి లో కీలక స్థానాన్ని అప్పజెప్పి, తాను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ ఉంటే, లోకేష్ పేరుతో తన రాజకీయ ప్రత్యర్థులు తనను టార్గెట్ చేసుకుంటూ. ఉండటం వంటి పరిణామాలతో చంద్రబాబు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. టిడిపి ప్రభుత్వం లో లోకేష్ మంత్రిగా పని చేసిన పార్టీపై పట్టు సాధించలేకపోవడం, అలాగే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓటమి చెందడం వంటివి లోకేష్ అసమర్థ నాయకుడు అనే విషయాన్ని గుర్తు చేస్తోంది.
ఒకవేళ లోకేష్ కనుక మంగళగిరిలో గెలిచి ఉంటే, ఇప్పటికే పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించి బాబు వెనుక చక్రం తిప్పే వారు. కానీ బాబు ఊహించు కుంది ఒకటైతే, జరుగుతుంది మరొకటి అయింది.ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్ప చెప్పినా, ఆయన పార్టీని నడప లేరని, పార్టీ నేతల్లో తిరుగుబాటు వస్తుందని, ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంకా మరి కొంతమంది నాయకులు లోకేష్ ను ఉద్దేశించి పదేపదే దారుణమైన మాటల తో విమర్శిస్తూ వస్తుండడం, అసెంబ్లీలోనూ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ, లోకేష్ ప్రస్తావన తీసుకు వచ్చి అవహేళన చేయడం, అలాగే వైసిపి సోషల్ మీడియాలోనూ లోకేష్ కు సంబంధించి వ్యంగ్యంగా అసమర్ధుడుగా చిత్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారం పైన బాబు కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నారు.
టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్ప చెబుతారు అనే ఉద్దేశంతోనే వైసిపి నాయకులు అంతా లోకేష్ ను అసమర్థుడు గా జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని బాబు తన బాధ్యతను అత్యంత సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారట. ఈ విమర్శలకు తిరిగి ప్రతి విమర్శలు చేస్తే, మరింతగా వైసిపి నాయకులు రెచ్చిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం తో ఎన్ని తిట్టినా తట్టుకుంటూ నే బాబు లోకేష్ ను సమర్థుడుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
-Surya