రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఓట్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీసీలపై ఆధారపడి పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రధాన పార్టీలు బీసీలు జపం చేస్తాయి. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు కూడా అదే పనిలో ఉన్నారు. అసలు బీసీలంటే టిడిపి….టిడిపి అంటే బీసీలు అనేలాగా పరిస్తితి ఉండేది. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అండగా నిలిచింది టిడిపినే. అందులో ఎలాంటి డౌట్ లేదు.
అందుకనే బీసీలకు పార్టీలో పెద్ద పీఠ వేస్తున్నారు. అయితే ఎన్ని చేసిన బీసీలు జగన్ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఇటీవల పవన్ కల్యాణ్ ప్రభావం వల్ల బీసీలకు మరింత ఆగ్రహం వచ్చిందని చెప్పొచ్చు. పవన్…తన సొంత కాపు వర్గాన్ని పైకి లేపుకుంటూనే, కమ్మ వర్గానికి సపోర్ట్ గా ఉంటామని మాట్లాడినా విషయం తెలిసిందే. వైసీపీ కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసిందని, ఆ వర్గానికి తాము అండగా ఉంటామని చెప్పారు. ఇలా చెప్పడంతో కమ్మ, కాపు వర్గాలు ఒక్కటిగా అవ్వనున్నాయని అర్ధమైపోతుంది. దీంతో జగన్…బీసీలని ఇంకా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఏపీలో సగంపైనే ఓట్లు బీసీలవే. ఈ క్రమంలోనే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. బీసీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ జనగణన చేపట్టాలని చంద్రబాబు, ప్రధాని మోడీకి లేఖ రాశారు.
సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. అంటే బీసీలకు అండగా ఉంటున్నట్లు చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. మరి చంద్రబాబుకు బీసీలు ఎంతవరకు అండగా ఉంటారో చూడాలి.