తీవ్రవాదులను ఎదర్కోవాలంటే వారికి ఆయుధాలు ఇవ్వాల్సిందే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

జమ్ము కాశ్మీర్ లో ఇటీవల స్థానికేతర ప్రజలపై జరగుతున్న దాడులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తీవ్రవాదులను సరైన పాఠం నేర్పాలంటే అక్కడ నాన్ లోకల్ ప్రజలకు ఆయుధాలు అందించాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాలు ఇవ్వాలన్నారు. గతంలో పంజాబ్ లో తీవ్రవాదం ప్రబలుతున్నప్పుడు ఏకే 47 తుపాకులకు లైసెన్సులు ఇచ్చేవారని, ఇప్పుడ జమ్ము కాశ్మీర్ ప్రజలకు కూడా ఇదే విధంగా చేయవచ్చని సూచించారు. ప్రభుత్వం స్థానికేతరులను ఏకం చేయాలని, వారిని నిర్థిష్ట ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేయాలని, వారికి ఉద్యోగంతో పాటు వ్యక్తిగత భద్రత, ప్రభుత్వ భద్రత అందిచాలని కోరారు. పేదలను, వెనుకబడిన వారిని చంపడం వల్ల కాశ్మీర్ లో భయానక వాతావరణం కల్పించవ్చని తీవ్రవాదులు భావిస్తున్నారని జ్ఞాను అన్నారు. బీఎస్ఎఫ్, సైన్యంతో పోరాడే ధైర్యం వారికి లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కాశ్మీర్ లో స్థానికేతరులపై తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు. కుల్గామ్ లో ఇటీవల ముగ్గురు బీహార్ పౌరులను కాల్చిచంపారు. వీరితో పాటు యూపీకి చెందిన వ్యక్తులను కూడా తీవ్రవాదులు చంపారు. దీంతో స్థానికేతరులకు ఆయుధాలు ఇవ్వాలనే ప్రతిపాదన చేశారు బీజేపీ ఎమ్మెల్యే.

Read more RELATED
Recommended to you

Exit mobile version