చేతులెత్తేసిన బాబు… ఇక అంతా మోడీకి అప్ప‌గించేశారా…!

-

ఏపీలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ముందుండి ఎలుగెత్తి చాటాల్సిన వారు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌న దూకు డును చూపించాల్సిన వారు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు. అయితే, ఆయ‌న ఇటీవ‌ల కాలంలో చేస్తున్న కొన్ని వ్యాఖ్య‌లు.. ప‌రిశీలిస్తే.. ఇక‌, తాను చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని, తాను ఇక‌, నిమిత్త‌మాత్రుడ‌నేన‌ని, త‌న వ‌ల్ల కాద‌ని తేల్చి చెబుతున్న‌ట్టుగా అనిపిస్తున్నాయి. మొత్తం భారం అంతా కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపైనే ఉంద‌ని ఆయ‌నే నేరుగా అన్న వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీగానే వైరెల్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ ఉనికి ఎంత మాత్రం లేదు. అయితే, ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. ప‌ట్టు చిక్కించు కునేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.  అయితే, ప్ర‌జ‌లు మాత్రం బీజేపీని అక్కున చేర్చుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి ఊపిరులూదాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని అక్క‌డి రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు 200వ రోజుకు చేరాయి. ఈ సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ ర్యాలీ (ఆన్‌లైన్ పోరాటం) చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు..  అమ‌రావ‌తిని కాపాడాల్సిన బాధ్య‌త‌, బ‌రువు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపైనే ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యం చంద్ర‌బాబు అనుకూల మీడియాలోనూ వ‌చ్చింది. అంతేకాదు, విశాఖ‌లో జ‌రిగిన ఎల్జీపాలిమ ‌ర్స్  వ్య‌వ‌హారం స‌మ‌యంలోనూ కేంద్రం ప‌ట్టించుకోవాల‌ని, కేంద్రానికి బాధ్య‌త లేదా? అని కూడా బాబు ప్ర‌శ్నించారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ వ్య‌వ‌హారంపై కూడా కేంద్రం స్పందించాల‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే కోరారు. వీటిని ప‌రిశీలించిన కొంద‌రు విశ్లేష‌కులు.

ఇక‌, రాష్ట్రంలో చంద్ర‌బాబు ప‌ని అయిపోయిందా?  లేక‌.. బీజేపీతో క‌లిసేందుకు ఇలా మ‌రో మార్గం వెతుక్కుంటున్నారా? అంటూవ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. ఏదేమైనా.. ముందుండి పోరాడాల్సిన చంద్ర‌బాబు ఇలా చేతులు ఎత్తేసిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో బీజేపీలోనూ ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇది.. మున్ముందు చంద్ర‌బాబుకు, టీడీపీకి కూడా ఇబ్బందేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version