చంద్రబాబు అధికారంలేకపోతే అపరిచితుడిగా మారిపోతారని అంటున్నారు ఆయనగురించి బాగా తెలిసినవారు! ఆయనకు అల్జీమర్ వ్యాధి వచ్చిందని చెబుతుంటారు కేవీపీ లాంటివారు! బాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అంటుంటారు వైకాపా నేతలు! బాబు టీడీపీ కాడిని దించేసినట్లేనని అనుకుంటున్నారు తమ్ముళ్లు! వీరు వారు అనుకోవడం సంగతి కాసేపు పక్కనపెడితే… 2022లో ఎన్నికలు వస్తాయి, వాటికి అంతా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నారు చంద్రబాబు!
అవును.. కలొచ్చిందా, లేక హస్తిన నుంచి కబురొచ్చిందా అన్నది తెలియదు కానీ… 2022లో జమిలీ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా అమలాపురం పార్లమెంట్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… జగన్ చేతగాని పాలనతో చేతులెత్తేశారని చెప్పుకొచ్చారు! కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో జగన్ ఎంతో చాకచక్యంగా పాలన సాగించారని దేశంమొత్తం చెబుతున్న వేల.. బాబుకు అలా కనిపించింది!
కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ భారత్ దివస్ కు సంబంధించిన జాతీయ అవార్డుల్లో ఏన్నడూ లేనివిధంగా ఏపీకి మూడు అవార్డులు వచ్చాయి! గ్రామసచివాలయ వ్యవస్థపై ప్రధానిసైతం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు! అయినా కూడా జగన్ కు పాలన చేతకాక చేతులెత్తేశారని బాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. కార్యకర్తలను మోసం చేస్తున్నారు!!
మరో విచిత్రం ఏమిటంటే… నిజంగా 2022కి ఎన్నికలు వస్తే చంద్రబాబు రెడీగా ఉన్నారా? అప్పటికి బాబుకు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు దొరుకుతారా? ఇప్పటికే రాష్ట్రం విడిచి భాగ్యనగరంలో తలదాచుకుంటున్న బాబు.. ఏపీకి వస్తారా? చినబాబు సైకిల్ యాత్ర చేస్తారా? కానిపక్షంలో… అప్పటికి ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇవన్నీ బాబు మాటలు విని విని అలసిపోయిన టీడీపీ కార్యకర్తల ప్రశ్నలు.. బాబుసైతం సమాధానం చెప్పలేని క్లిష్ట ప్రశ్నలు! కాలం మాత్రమే సమాధానం చెప్పగల సంక్లిష్ట ప్రశ్నలు!
ఈ సందర్భంగా బాబు చెప్పిన మాటలకు… “జగన్ పాలన చేతకాక చేతులెత్తేశారో లేదో తెలియదు కానీ… పార్టీని కాపాడుకోలేక, జగన్ ని ఎదుర్కోలేక కరోనా పేరుచెప్పి తమరు చేతులు కాళ్లూ కూడా ఎత్తేశారు..” అని వినిపిస్తోన్న కార్యకర్త ఇన్నర్ వాయిస్ కొసమెరుపు!!
-CH Raja