బాబు vs బీజేపీ: పొగిడినా తిడుతున్నారు.. తిట్టినా తిడుతున్నారు!

-

చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో, ఇరుకునపెట్టే విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు! అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు! మరోపక్క చంద్రబాబేమో మోడీ మెప్పుకోసం అన్నట్లుగా ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా బీజేపీని తెగ పొగిడేస్తున్నారు. అయినా కూడా ఆ పొగడ్తల్లో కూడా బాబుపై సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు!

అవును… పాపం బీజేపీతో రాసుకుపూసుకుందామని బాబు ఎన్ని రకాలుగా ప్లాన్స్ వేసినా… ఏపీ బీజేపీ నేతలు మాత్రం బాబుని తొక్కేస్తున్నారు. ఆయన ప్లాన్స్ ఏవీ హస్తినకు చేరకుండానే ఏపీలోనే తొక్కేస్తున్నారు! అందులో భాగంగా… తాజాగా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మోడీ సర్కార్ ని ప్రశంసిస్తూనే ట్వీటారు. అయినా కూడా బీజేపీ నేతలు బాబు “యూటర్న్” పై సెటైర్లు వేస్తున్నారు!

“విదేశీ రఫెల్ యుద్దవిమానాలు, స్వదేశీ తేజస్ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకుని మరింత శక్తివంతమైన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణం. వైమానిక దళ 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తోన్న వైమానికదళ వీరులకు, వారి కుటుంబాలకు గౌరవాభివందనం.” అని ట్వీటార్ బాబు! అయితే ఈ ట్వీట్ పై ట్విట్టర్ లోనే స్పందించారు విష్ణు!

“చంద్రబాబు గారు అధికారంలో వున్నప్పుడు ఓట్ల కోసం, తన స్వార్థ మిత్రపక్షం కాంగ్రెస్ మెప్పుకోసం రఫెల్ ఒక కుంభకోణం అంటూ ట్వీట్. నేడు తను అధికారం కోల్పోయిన తరువాత.. దేశం గర్వించదగ్గ యుద్ధ విమానం రఫెల్ అంటూ మరో ట్వీట్ తో పోగొడుతున్నారు. యూటర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు ఇంకెన్నేళ్లు బాబు?” అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version