‘సున్నాల’ బాబు…175-170=5 సరిపోతాయా?

-

ఎవరైనా విద్యార్ధి సరిగ్గా చదవకుండా మార్కుల్లో సున్నాలు తెచ్చుకుంటుంటే, ఆ విద్యార్ధి తల్లిదండ్రులు ఉరుకుంటారా? ఎలాగోలా నయానో, భయానో పిల్లలకు సర్ది చెప్పి ఈ సారి మంచి మార్కులు వచ్చేలా చేసుకుంటారు. అంటే ఒకసారి సున్నా మార్కులు వస్తేనే తల్లిదండ్రులు అలెర్ట్ అయ్యి, తమ పిల్లలకు సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు మంచిగా చదువుకునేలా చేస్తారు. అయితే రాజకీయాల్లో కూడా ఇలాగే ఉంటుంది…ఏ పార్టీ అధినేత అయినా…తమ పార్టీని మంచి పొజిషన్‌లో చూడాలని అనుకుంటారు.

ఓటములు ఎదురువచ్చిన పొరాడి మళ్ళీ పైకి తీసుకోచ్చేందుకు చూస్తారు. కానీ టి‌డి‌పి అధినేత చంద్రబాబు మాత్రం అలా చేస్తున్నట్లు కనిపించడం లేదు. వరుసగా ఓటములు వచ్చినా…ఎప్పుడూలేని విధంగా సున్నా ఫలితాలు వచ్చినా సరే మన బాబు గారు మారడం లేదు. అదేమన్న అంటే తన ఓటమిని కూడా జగన్ మీద తోసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అరాచకాలు, కుట్రలు చేసి గెలుస్తుందని పిల్లల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. వాళ్ళు కుట్రలు, అరాచకాలు చేస్తుంటే మీరు సినిమా చూస్తున్నారా? మీరు ఏమి చిన్న నాయకుడు కాదు…పార్టీ ఏమి చిన్న పార్టీ కాదు. పోరాడకుండా పులిహోర కబుర్లు చెప్పడం వల్ల టి‌డి‌పికే భారీ నష్టం జరుగుతూ వెళుతుంది.

ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే…దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చింది. అంటే టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా పార్టీ ఓడిపోయింది. ఈ అన్నీ ఎన్నికల్లో ఏదో నాలుగైదు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన 170 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మరి దీని బట్టి చూసుకుంటే మన సున్నాల బాబుకు ఈ సారి పెద్ద గుండు సున్నానే మిగిలేలా ఉంది. గత ఎన్నికల్లో ఏదో 23 సీట్లు అయినా వచ్చాయి…ఈ సారి 5 సీట్లు వచ్చిన గొప్పే అనే విధంగా పరిస్తితి ఉంది. అంటే 175లో 170 వైసీపీ గెలుచుకుంటే…టి‌డి‌పికి మిగిలేది 5.

Read more RELATED
Recommended to you

Exit mobile version