ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి అసక్తకర వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్.. వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదని.. పేదల హృదయాలను గెలుచుకున్న నాయకూడని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారన్నారు. అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వమని…అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుందని మండిపడ్డారు.
బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారని.. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కోడెల చావుకు చంద్రబాబే కారణమని.. అయ్యన్నని దళితులు క్షమించరు.. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీల మధ్య ఘర్షణ పెట్టేలా అయ్యన్న వ్యవహరిస్తున్నారని.. తమిళనాడులో జయలలిత స్థానిక ఎన్నికలను బాయ్ కాట్ చేసినప్పుడు పోటీనే చేయలేదని గుర్తు చేశారు. ఓటు హక్కును ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబని అని నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.