బాబు…మా చినబాబుకు ఇంత అన్యాయం చేస్తావా..

-

రాజకీయాల్లో ఏ నాయకుడైన తమ వారసుడుని పెద్ద నాయకుడుగా చేయాలని అనుకుంటారు. అలా ప్రతి నేత అనుకుంటారు…అలాగే మన బాబు గారు కూడా అనుకున్నారు…నారా లోకేష్ అలియాస్ చినబాబుని సైతం పైకి లేపాలని అనుకున్నారు. అసలే ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాం మళ్ళీ మన దగ్గర నుంచి మరొకరు పార్టీ లాక్కోకూడదని చెప్పి బాబు….తన వారసుడైన చినబాబుని నాయకుడు చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ చినబాబుని నాయకుడు చేయడానికి బాబు ఎన్ని రకాలుగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. కొడుకు ఎంత అసమర్ధుడు అయినా ఏ తండ్రి వదిలేస్తారు చెప్పండి…అందుకే మన చినబాబుకు వరుసపెట్టి మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ప్రజల్లో నుంచి గెలిపించకుండా ఎమ్మెల్సీని చేసి దొడ్డిదారిన మంత్రిని చేశారు. మంత్రి అయ్యాక చినబాబు పర్ఫామెన్స్ అందరూ చూశారు. ఆయన దెబ్బకు పార్టీకే పెద్ద బొక్క పడింది.

పైగా మంగళగిరి సీటు.. అదే మన చినబాబు బాషలో మందలగిరి సీటు ఇచ్చిన ఉపయోగం లేకుండా పోయింది. మొదటిసారే చినబాబుకు ఊహించని ఓటమి ఎదురైంది. అటు పార్టీ కూడా జగన్ సునామీలో కొట్టుకుపోయింది. మరి ఇక్కడ నుంచే అసలు సినిమా మొదలైంది…మన చినబాబు పూర్తిగా మారుతూ వచ్చారు…మాట తీరు…వంటి తీరు కూడా మార్చుకుని దూకుడుగా రాజకీయం మొదలుపెట్టారు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ…మళ్ళీ మంగళగిరి బరిలో దిగితే చినబాబుకు విజయం దక్కడంపై అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సారి చంద్రబాబు త్యాగం చేసి..తన నియోజకవర్గం కుప్పం చినబాబుకు ఇద్దామని ఫిక్స్ అయ్యారని ప్రచారం మొదలైంది. అక్కడ అయితేనే లోకేష్ బాబు సేఫ్‌గా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఆ ఆశలు కూడా ఆవిరి అయిపోయాయి. కుప్పంలో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధించింది. నియోజకవర్గం మొత్తం వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో నెక్స్ట్ ఇక్కడ చినబాబు బరిలో దిగితే కొంప కొల్లేరు అయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా బాబు…కుప్పం నియోజకవర్గాన్ని కూడా కాపాడకుండా మా చినబాబుకు అన్యాయం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version