నో కామెంట్: పుట్టింటిని పట్టించుకోని ఇల్లరికం అల్లుడు!

-

ఎన్నికల్లో పోటీ చేయడం మొదలెట్టినప్పటినుంచీ అవిరామంగా గెలుస్తూ వస్తున్నారంటే అది చంద్రబాబు గొప్పతనం మాత్రమే కాదు! చంద్రబాబు ఎన్ని కేసులపై స్టే లు తెచ్చుకుంటున్నా.. ఎన్ని పార్టీలతో కూటములు పెట్టుకుంటూన్నా.. ఒక్కో ఎన్నికల్లోనూ ఒక్కో తోడు తెచ్చుకుని ఎన్నికలవరకూ సహజీవనం చేస్తున్నా… ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు… సీఎం అవ్వడానికి గల అన్నిరకాల మద్దతు ఇస్తున్నారు! మరి బాబు పుట్టింటికి చేసిందేమిటి?

రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్ర‌బాబునాయుడు… తన పుట్టింటి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు! అసలు తాను ఇన్నిసంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎప్పుడైనా సీమ గురించి ఈ స్థాయిలో ఆలోచించారా? సీమ ప్రజలు ఎప్పటినుంచో కంటున్న కల… కర్నూలులో హైకోర్టు… సీమకు కూడా రాజధాని హోదా.. అంశాలపై బాబు ఎప్పుడైనా మనసు పెట్టారా? మనసు సంగతి దేవుడెరుగు.. కనీసం ఎవరైనా చెబితే చెవికైనా ఎక్కించుకున్నారా?

అయినా తన పుట్టింటిని తాను ఉద్దరించాలని ఒకరు చెప్పాలా? తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు ఎలాగో… సీమ ప్రాంతం కూడా అలానే అని బాబు భావించాలి కదా? ఇప్పటికీ బాబు నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? ఇంతకు మించి పుట్టింటికి చేసిన అన్యాయం మరొకటి కనిపిస్తుందా?

పోనీ అత్తగారి ఊరిపైన ఏదో ప్రేమ ఉందా అనుకుంటే… అందుకు ఒక మెతుకు పట్టుకుని చూద్దాం! నిజంగా పోనీ కృష్ణా – గుంటూర్ ప్రాంతాలకు ఇల్లరికం అల్లుడిగా మారినా… వాటి అభివృద్ధికి బాబు చేసిందేమిటి? విజయవాడలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బాబు కట్టగలిగారా? అది ఆయనకు ఆ ప్రాంతంపై ఉన్న శ్రద్ధ! ఇది ఆ ప్రాంతాలపై బాబుకున్న శ్రద్ధ!! అమరావతి కూడా ఆ రెండు జిల్లాల జనాలపై ఉన్న ప్రేమ అనుకుంటే పొరపాటే సుమా… కొందరు ప్రత్యేక జనాలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ అంతే!

అలా కానిపక్షంలో… ముందుగా ప్రజలకు ప్రకటించిన తర్వాతే… అమరావతిలోనే రాజధాని అని ప్రకటించేవారు కదా! ముందుగా వైకాపా నేతలు చెబుతున్నట్లు “ఇన్ సైడ్ ట్రేడింగ్” చేసిన తర్వాత.. వారు అనుకున్నవారంతా భూములు కొన్న తర్వాతనే కదా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసింది!! ఇవన్నీ గుంటూరు – కృష్ణాలో ఉన్న ఒక సామాజిక వర్గానికి తెలియకపోవచ్చు కానీ…. మిగిలినవారందరికీ తెలుసు.. ఫలితమే 2019 ఎన్నికల ఫలితాలు!

Read more RELATED
Recommended to you

Exit mobile version