Breaking : అమిత్‌ షాకు చంద్రబాబు ఫోన్‌

-

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. అమిత్ షాకు ఆయురారోగ్యాలు సిద్దించాలని ఆకాంక్షించారు చంద్రబాబు.

సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పినప్పటికీ…ఆ తర్వాత కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు… అమిత్ షా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబుకు అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version