కేసీఆర్‌పై ప్రజాగ్రహం.. ఎమ్మెల్యేలు దారుణమే..!

-

వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వం పట్ల..తెలంగాణ ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారా? అంటే మెజారిటీ ప్రజలు సంతృప్తిగా లేరని తాజాగా ‘ఇండో-ఏసియన్‌ న్యూస్‌ సర్వీస్‌ (ఐఏఎన్‌ఎస్)’ కోసం సీవోటర్‌ సంస్థ సర్వే చేసి రూపొందించిన ‘యాంగర్‌ ఇండెక్స్‌’లో తేలింది. అత్యధికంగా ప్రజాగ్రహం ఎదురుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాల్లో కేసీఆర్ ప్రభుత్వం టాప్ 1లో ఉంది.

ఏకంగా 66.8 శాతం మంది కేసీఆర్‌ సర్కారు పాలనపై అసంతృప్తిగా ఉన్నారని తేలింది. అంటే కేసీఆర్ సర్కార్ పనితీరు పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిగా లేరు. అలాగే ఎక్కువ ప్రజాగ్రహం ఎదురుకుంటున్న ముఖ్యమంత్రుల లిస్ట్‌లో కూడా కేసీఆర్ ముందే ఉన్నారని తేలింది. ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే కాదు..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. 23.5 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలింది. అంటే ఎక్కువ శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలుస్తోంది.

ఎందుకంటే ఎం‌ఐ‌ఎంకు 7, కాంగ్రెస్‌కు 5 గురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 12 మందితో పాటు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మినహాయిస్తే 106 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఇక వీరిలో 25 మంది ఎమ్మెల్యేల దాకా ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది..వీరికి మళ్ళీ గెలవడం కూడా కష్టమని తెలుస్తోంది. ఎన్నికలనాటికి ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్తితిని బట్టి చూస్తే..తెలంగాణలో టీఆర్ఎస్‌ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఆ ప్రభుత్వం, సీఎంగా కేసీఆర్‌పై వ్యతిరేకత ఎక్కువ ఉందంటే..ఆ ప్రభావం మొత్తం పార్టీపై పడుతుంది. కేసీఆర్ ఇమేజ్ బట్టే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంకా కష్టపడాలి . అదే సమయంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఇంకా బలం పెంచుకోవడానికి ఇది మంచి సమయం. మరి చూడాలి కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతని బీజేపీ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version