ఆ రకంగా నిమ్మగడ్డ పరువుని బలికోరుతోన్న బాబు!

-

ఏ ముహూర్తాన్న ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారో తెలియదు కానీ… ప్రస్తుతం నిమ్మగడ్డ పడుతున్నపాట్లు పగోడికి కూడా రావద్దని అంటున్నారట ఒక వర్గం జనం! బ్రతికినంతకాలం హుందాగా బ్రతికి ఆఖరికి ఇంటినెక ఏదో అయ్యిందన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారట. రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తుల మధ్య నిమ్మగడ్డ జీవితం పోకచెక్క అయిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఉన్నతమైన ఉద్యోగం, గౌరవమైన పదవి, పదిమంది నమస్కరం పెట్టే పని ఇలా సాగిపోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ జీవితంలో చేసిన తప్పుఏమైనా ఉందా అంటే… టీడీపీ నేతల మాటలకు “సై” అనడమే అని కామెంట్లు పడుతున్నాయి. భారతదేశ చరిత్రలో ఈస్థాయిలో కోర్టు మెట్లు.. రాజ్ భవన్ మెట్లు.. అప్పుడప్పుడూ పార్క్ హయత్ లాంటి ఫైవ్ స్టార్ హోటల్ల లిఫ్ట్లు ఎక్కిన చరిత్ర ఎవరికీ ఉండకపోవచ్చు! ఆ సంగతులు అలా ఉంటే… మరోసారి టీడీపీ – వారి మీడియా మధ్య నలిగిపోతున్నారు నిమ్మగడ్డ!

నిమ్మగడ్డ వ్యవహారం ఈస్ స్థాయిలో పబ్లిక్ అవ్వడానికి గల కారణం… టీడీపీ రాజకీయ స్వార్థం, ఆ మీడియా అత్యుత్సాహం అనేది బలంగా వినిపిస్తోన్న మాట! నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వానికి మద్య ఉన్న ఒక సమస్యను… రాష్ట్ర సమస్యగా, టీడీపీ పార్టీ ప్రిస్టేజ్ ఇష్యూ విషయంగా మార్చడంలో ఒక వర్గం మీడియా ఫుల్ గా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. పోనీ అలా అని ఆయనతో పనిలేదని టీడీపీ భావిస్తే… పసుపు మీడియా ఆనను కన్నెత్తి అయినా చూస్తుందా… వారికే తెలియాలి!

ఈ క్రమంలో బాబు రాజకీయ చాణక్యానికి – వారి వర్గం మీడియా క్రియేటివిటీకి… నిమ్మగడ్డ లైఫ్ ఇలా మారిపోయిందని… ఎక్కే మెట్లు – దిగే మెట్లకే ఉన్న సమయం సరిపోతుందని.. ఇలానే మరికొన్ని రోజులు జరిగితే ఉన్న పదవీకాలం కూడా అయిపోతుందని ఫీలవుతున్నారట! ఈ సమయంలో నిమ్మగడ్డను నియమించిననంత మాత్రాన్న ఏపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు… నియమించనంత మాత్రాన్న నిమ్మగడ్డకు కొత్తగా పోయేదీ లేదు… వీరిద్దరూ అంత లైట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నా… టీడీపీ మాత్రం నిమ్మగడ్డ పరువుని బలికోరుతుందని, అందులో భాగంగానే ఎగదోస్తుందని అంటున్నారు విశ్లేషకులు!

నిమ్మగడ్డ వ్యవహారం కేవలం “ఒక ఎస్.ఇ.సి. – ఒక రాష్ట్ర ప్రభుత్వం” కి మధ్య ఉన్న సమస్యగా మాత్రమే ఉంటే… ఇప్పటికి అది పరిష్కరించబడి చాలారోజులే అయ్యేది. కానీ… ఎప్పుడైతే నిమ్మగడ్డ అత్యుత్సాహంతో తనవెనక చంద్రబాబు ఉన్నాడు, పత్రికలు ఉన్నాయి, కులం ఉంది, మతం ఉంది, బీజేపీలోనిటీడీపీ ఉందని భావించారో.. ఏపీ ప్రభుత్వంపై కాలు దువ్వారో.. నాటి నుంచే “తన అజ్ఞానం – చంద్రబాబు రాజకీయ జ్ఞానం” మధ్య నిమ్మగడ్డ నలిగిపోయారని.. ఇక పిప్పి మాత్రమే మిగిలిందని కామెంట్లు వినిపిస్తుండగా… నిమ్మగడ్డ పరిస్థితిని మొదటినుంచీ ఫాలోఅవుతున్నవారు మాత్రం… పగోడికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని అంటున్నారట!

Read more RELATED
Recommended to you

Exit mobile version