‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రతిపక్షం ఆంధ్రాతోనే ఆడుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇవాళ అసెంబ్లీలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ స్కీంపై ప్రస్తావించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రతిపక్షం ఆంధ్రాతోనే ఆడుకుందన్నారు భూమా అఖిలప్రియ.
వాళ్లు ఆడుకుంటే.. మేము కాపాడుతున్నామని వెల్లడించారు. వైసీపీ వాళ్లే ఆడడం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనబడలేదని ఆగ్రహించారు. పబ్లిసిటీ కోసమే రూ.35 కోట్లు ఖర్చు పెట్టారని బాంబ్ పేల్చారు. 45 రోజుల్లో అడుదాం ఆంధ్ర పై నివేదిక ఇస్తామన్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతోందని వివరించారు. మొన్న శాసన మండలి లో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. ఇక అటు అడుదాం ఆంధ్ర లో అవినీతి పై సీరియస్ గా విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు తెలియాలని మంత్రికి సూచించారు అయ్యన్న పాత్రుడు.
'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ప్రతిపక్షం ఆంధ్రాతోనే ఆడుకుంది: భూమా అఖిలప్రియ
వాళ్లు ఆడుకుంటే.. మేము కాపాడుతున్నాం
వైసీపీ వాళ్లే ఆడడం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనబడలేదు
పబ్లిసిటీ కోసమే రూ.35 కోట్లు ఖర్చు పెట్టారు
– ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ pic.twitter.com/057W2YI87W
— BIG TV Breaking News (@bigtvtelugu) March 10, 2025